Mallikarjun Kharge Fired on EC : ఓటు చోరీ కేసులో బీజేపీని ర‌క్షించిన ఈసీ

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

Hello Telugu - Mallikarjun Kharge Fired on EC

Hello Telugu - Mallikarjun Kharge Fired on EC

Mallikarjun Kharge : ఢిల్లీ : ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై. ఓటు చోరీ కేసు విష‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీని ర‌క్షించింద‌ని మండిప‌డ్డారు. ఆధారాల‌తో స‌హా ఎలా ఓట‌ర్ల‌ను తొల‌గించిందో చెప్పినా, స‌మ‌ర్పించినా ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జ‌రిగే ఎన్నిక‌ల తీరుపై ప‌లు అనుమానాలు నెల‌కొనేలా కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హ‌రించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆదివారం ఖ‌ర్గే (Mallikarjun Kharge) మీడియాతో మాట్లాడారు. చివ‌ర‌కు సుప్రీంకోర్టు ఆదేశిస్తే కానీ ఈసీ క‌ద‌ల‌లేద‌ని, గ‌త్యంత‌రం లేక బీహార్ లో తొల‌గించిన ఓట‌ర్ల జాబితాను తిరిగి ప్రచురించింద‌ని అన్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జాస్వామ్యానికి ఆయువు ప‌ట్టుగా ఉండాల్సిన ఈసీ ఇలా ఒకే పార్టీకి కొమ్ము కాయ‌డం దారుణ‌మ‌న్నారు ఖ‌ర్గే.

Mallikarjun Kharge Key Comments

కీలకమైన సమాచారాన్ని రాయిలా కొట్టి వేశారని ఆరోపించారు. ఇది ఓటు చోరీ వెనుక ఉన్న వారిని సమర్థవంతంగా కాపాడుతుందని పేర్కొన్నారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఫారమ్ 7ను నకిలీ చేయడం ద్వారా ఓటర్లను తొలగించే ప్రయత్నంతో సంబంధం ఉన్న కేసు చల్లబడి పోయిందని వాపోయారు. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం నుండి తక్షణ స్పందన లేదు కానీ గతంలో కాంగ్రెస్ చేసిన అన్ని వాదనలను నిరాధారమైనవిగా పోల్ బాడీ తోసిపుచ్చ‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు ఖ‌ర్గే. ఫిబ్రవరి 2023లో ఒక కేసు నమోదైంద‌ని. దర్యాప్తులో 5,994 నకిలీ దరఖాస్తులు వెల్లడయ్యాయని చెప్పారు ఏఐసీసీ చీఫ్ . బీజేపీ చేతిలో ఈసీ కీలుబొమ్మ‌గా మారింద‌ని ఆరోపించారు.

Also Read : Bandlaguda Laddu Sensational : దేశంలోనే బండ్ల‌గూడ ల‌డ్డూ రికార్డ్

Exit mobile version