Mallikarjun Kharge: ఢిల్లీ : తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంచలన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తెలంగాణలోని నాలుగు జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారు. కొత్తగా నియమించబడిన జిల్లా అధ్యక్షుల్లో ముగ్గురు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు. : ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు కొత్త జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నియమించింది.
Mallikarjun Kharge Comments
కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుల్లో ముగ్గురు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా డాక్టర్ నరేష్ జాదవ్, నిర్మల్ జిల్లాకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు ఆత్రం సుగుణ, మంచిర్యాల జిల్లాకు పిన్నింటి రఘునాథ్‌రెడ్డిలను నియమించారు. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని ఏఐసీసీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఆయా జిల్లాల పార్టీ బాధ్యుల ఎంపికకు సంబంధించి సర్వేలు చేపట్టింది. త్వరలోనే ఇతర జిల్లాలకు కూడా అధ్యక్షులను నియమించనున్నట్లు సమాచారం. మొత్తంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ విక్టరీ సాధించడంతో ఆ పార్టీలో ఊపు వచ్చింది. సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది.
Also Read : Balmoori Venkat Fired on KTR : కేటీఆర్ కు మైండ్ దొబ్బింది : వెంకట్ బల్మూరి
