Mahesh Kumar Goud Fired on Bandi : దొంగ ఓట్లతోనే బండి సంజయ్ గెలుపు

టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్

Hello Telugu - Mahesh Kumar Goud Fired on Bandi

Hello Telugu - Mahesh Kumar Goud Fired on Bandi

Mahesh Kumar Goud : హైద‌రాబాద్ – టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజ‌య్ దొంగ ఓట్ల‌తోనే గెలిచాడ‌ని అన్నారు. ఆ పార్టీకి చెందిన మిగ‌తా ఎనిమిది మంది ఎంపీలు కూడా అలానే గెలిచార‌న్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. పని చేసి ఓట్లు అడగడం దమ్మున్న నాయకుడి లక్షణం అన్నారు. కానీ కులం పేరుతో, దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు బీజేపీ వాళ్లు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

Mahesh Kumar Goud Slams Union Minister Bandi Sanjay

కులాల పేరుతో, మ‌తాల పేరుతో , ప్రాంతాల పేరుతో మనుషుల మ‌ధ్య విభేదాలు సృష్టించి ప‌బ్బం గ‌డుపు కోవడం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ ప‌ని చేయాల‌ని సూచించారు. ఇంకెంత కాలం మతాన్ని అడ్డం పెట్టుకుని రాజ‌కీయం చేస్తార‌ని మండిప‌డ్డారు మ‌హేష్ కుమార్ గౌడ్. త‌మ పార్టీ అధినాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ లేవ‌దీసిన ప్ర‌శ్న‌ల‌కు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర్వ నాశ‌నం చేసిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు. ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని తీసుకు వ‌చ్చిన బిల్లును అందుకే తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని చెప్పారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుస‌రిస్తున్న విధానాలు ప‌లు అనుమానాలకు తావిస్తోంద‌న్నారు. అందుకే సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింద‌న్నారు. బీహార్ లో తొల‌గించిన 65 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ను తిరిగి ప్ర‌చురించాల‌ని ఆదేశించింద‌న్నారు. గ‌తంలో జ‌రిగిన మొత్తం ఎంపీల ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌న్నారు.

Also Read : Ganguly Growth : ప్రిటోరియా క్యాపిట‌ల్స్ జ‌ట్టు కోచ్ గా గంగూలీ

Exit mobile version