Ganguly Growth : ప్రిటోరియా క్యాపిట‌ల్స్ జ‌ట్టు కోచ్ గా గంగూలీ

వైదొలిగిన మాజీ బ్యాట‌ర్ జోనాథ‌న్ ట్రాట్

hellotelugu-ganguly

Ganguly : ఎస్ ఏ 20 ప్రిటోరియా క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్ గా బీసీసీఐ మాజీ చీఫ్ , సౌర‌వ్ గంగూలీ నియ‌మితుల‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ జ‌ట్టుకు కోచ్ గా ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జోనాథన్ ట్రాట్ ఉన్నారు. ఆయ‌న తాను కోచ్ గా ఉండ‌లేనంటూ ప్ర‌క‌టించ‌డంతో త‌న స్థానంలో గంగూలీని (Ganguly) నియమించారు. ఒక జట్టు వ్యవహారాల అధిపతిగా ఆయన తొలిసారిగా నియమితులయ్యారు. ప్రిన్స్ క్యాపిటల్స్ శిబిరానికి రాజరికపు ప్రతిభను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడ‌ని, మా కొత్త ప్రధాన కోచ్‌గా సౌరవ్ గంగూలీని ప్రకటించడానికి తాము సంతోషిస్తున్న‌ట్లు సెంచూరియ‌న్ ఆధారిత ఫ్రాంచైజ్ త‌న ఇన్ స్టా ఖాతాలో పేర్కొంది.

Ganguly As a Retoria Capitals Coach

ఇదిలా ఉండ‌గా సౌర‌వ్ గంగూలీ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండటం ఇదే మొదటిసారి. 2018 , 2019 మధ్య గంగూలీ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. BCCI అధ్యక్షుడైన తర్వాత ఆయన ఆ పదవిని ఖాళీ చేశారు. ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అయిన జేఎస్ డ‌బ్ల్యూ స్పోర్ట్స్ యాజమాన్యంలో ఉంది. గత సంవత్సరం గంగూలీ క్రికెట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

కాగా ఎస్ ఏ 20 కు సంబంధించి 2025 సీజన్‌కు ముందు ట్రాట్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు, కానీ ఫ్రాంచైజీ 10 గ్రూప్ మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలతో నాకౌట్‌లకు చేరుకోలేక పోయింది, ఆరు జట్ల టి20 లీగ్ పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది. ట్రాట్ స్థానంలో గంగూలీని నియ‌మించడం వ‌ల్ల జ‌ట్టు మ‌రంత బ‌లోపేతం అవుతుంద‌ని పేర్కొంది సంస్థ‌.

Also Read : BCCI Huge Lose – Dream11 : డ్రీమ్ 11ను కోల్పోనున్న బీసీసీఐ

Exit mobile version