Mahavatar Narasimha : ఎవరూ ఊహించని రీతిలో దుమ్ము రేపింది కాసుల వర్షం కురిపించింది మహావతార్ నరసింహ. థియేటర్లలో ప్రేక్షకులను కట్టి పడేసింది. సెప్టెంబర్ 19న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ఇందులో కూడా మంచి ఆదరణ చూరగొంది. ఎపిక్ మిథాలజికల్ ఫిల్మ్ గా దీనిని తీర్చిదిద్దాడు దర్శకుడు. భారతీయ సినిమాలో పౌరాణిక కథలు ఎల్లప్పుడూ పెద్ద భాగంగా ఉన్నాయి. మహావతార్ నరసింహ (Mahavatar Narasimha) అనేది దృష్టిని ఆకర్షించిన కొత్త చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం విష్ణువు నరసింహ అవతార కథకు ప్రాణం పోశారు మూవీ మేకర్స్. భావోద్వేగ దృశ్యాలు ప్రేక్షకులను సినిమాను చూసేందుకు రప్పంచేలా చేశాయి. మహావతార్ నరసింహ చిత్రం శుక్రవారం మధ్యామ్నం 12.30 గంటలకు స్ట్రీమింగ్ అయ్యింది.
Mahavatar Narasimha Movie OTT Updates
ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో సహా వివిధ భాషలలో అందుబాటులోకి తీసుకు వచ్చింది నెట్ ఫ్లిక్స్. దీని వలన అన్ని ప్రాంతాల ప్రజలు తమ భాషలో సినిమాను చూడటానికి వీలు కలుగుతుంది. కథా పరంగా చూస్తే మహావతార్ నరసింహ విష్ణువు నరసింహ అవతారం గురించిన పురాణ కథను చెబుతాడు. ఈ రూపంలో అతను తన భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించడానికి, రాక్షస రాజు హిరణ్యకశిపుని చంపడానికి సగం మనిషి , సగం సింహంగా ఉద్భవించాడు. యాక్షన్, ఆరాధన , నాణ్యమైన వీఎఫ్ఎక్స్ లతో సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇటీవలి కాలంలో అత్యుత్తమ యానిమేటెడ్ చిత్రంగా గుర్తింపు పొందింది. ప్రశంసలు అందుకుంది. దర్శకుడు అశ్విన్ ఏడు భాగాల మహావతార్ ఫ్రాంచైజీని ప్లాన్ చేశాడు, ప్రతి చిత్రం విష్ణువు అవతారాలలో ఒకదానిపై దృష్టి పెడుతుంది.
Also Read : Hero Yash Toxic Movie Update : యశ్ టాక్సిక్ చివరి షెడ్యూల్ స్టార్ట్

















