మ‌హోన్న‌త మాన‌వుడు మ‌హాత్మా గాంధీ : సీఎం

మ‌హోన్న‌త మాన‌వుడు మ‌హాత్మా గాంధీ : సీఎం

hellotelugu-cmrevanthreddy

హైద‌రాబాద్ : మ‌హోన్న‌త మాన‌వుడు మోహ‌న్ దాస్ క‌రమ్ చంద్ గాంధీ అని కొనియాడారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. అక్టోబ‌ర్ 2 గురువారం గాంధీ జ‌యంతి . ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ లోని గాంధీ ఘాట్ వ‌ద్ద పుష్ప‌గ‌చ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌యంతిని పుర‌స్క‌రించుకుని స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు చేశారు. ఇందులో సీఎం పాల్గొన్నారు. మూసీ నది ఒడ్డున ఉన్న గాంధీ స్మారక చిహ్నం బాపు ఘాట్‌ను సందర్శించి, జాతిపితకు పుష్పగుచ్ఛాలు అర్పించారు. సీఎంతో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మంత్రులు, కీల‌క‌ నాయకులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు.

మూసీ నది ఒడ్డున ఉన్న గాంధీ స్మారక చిహ్నం బాపు ఘాట్‌ను సందర్శించి, జాతిపితకు పుష్పగుచ్ఛాలు అర్పించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు కూడా మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అహింస, సత్యాగ్రహ మార్గంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి, దేశ ప్రజలలో స్వేచ్ఛా స్ఫూర్తిని నింపిన గొప్ప, అరుదైన మాన‌వుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా నేను ప్రేమగా గుర్తు చేసుకుంటున్నాను అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్ప‌ష్టం చేశారు.

Exit mobile version