Maha Chandi Devi Interesting : శ్రీ మ‌హాచండీ అవ‌తారంలో క‌న‌క‌దుర్గ‌మ్మ

అంగ‌రంగ వైభ‌వంగా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

Hello Telugu - Maha Chandi Devi Interesting

Hello Telugu - Maha Chandi Devi Interesting

Maha Chandi Devi : విజ‌యవాడ : బెజ‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై వెల‌సిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ (Kanaka Durga) అమ్మ వారి ద‌స‌రా శ‌ర‌న్నవరాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈనెల 24న ప్రారంభ‌మైన ఈ ఉత్స‌వాలు అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని పెద్ద ఎత్తున అమ్మ వారిని ద‌ర్శించుకుని భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు. ఉత్స‌వాలు అయి పోయేంత వ‌ర‌కు 20 ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించుకుంటార‌ని అంచ‌నా వేస్తున్నారు నిర్వాహ‌కులు. ఇప్ప‌టికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆల‌య క‌మిటీ. ఈనెల 29న రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ్మ వారిని ద‌ర్శించుకుంటారు. రాష్ట్ర స‌ర్కార్ త‌ర‌పున అమ్మ వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి. ల‌క్ష్మీశ వెల్ల‌డించారు. భ‌క్తుల కోసం ఇప్ప‌టికే 35 ల‌క్ష‌ల ల‌డ్డూలు త‌యారు చేసి ఉంచామ‌న్నారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామ‌న్నారు.

Maha Chandi Devi Avatar Interesting

ఇదిలా ఉండ‌గా 11 రోజుల పాటు ప్ర‌తి రోజూ అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తున్నారు అమ్మ వారు.
ఏడవ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి ఆదివారం రోజు శ్రీ కనక దుర్గమ్మ శ్రీ మహా చండీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారు ఉద్భవించింది అనేది పురాణాలు చెబుతున్నాయి. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లేన‌ని భ‌క్తుల విశ్వాసం. శ్రీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ సత్వరమే లభిస్తాయని విశ్వాసం.

Also Read : CM MK Stalin Clear Orders : విజ‌య్ ర్యాలీ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశం

Exit mobile version