Maganti Sunitha Interesting Update : ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత‌

కుటుంబ‌తో క‌లిసి ఓటు వేసిన అభ్య‌ర్థిని

Hello Telugu - Maganti Sunitha Interesting Update

Hello Telugu - Maganti Sunitha Interesting Update

Maganti Sunitha : జూబ్లీహిల్స్ : తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం జూబ్లీహిల్స్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఉప ఎన్నిక కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కే పోలింగ్ ప్రారంభ‌మైంది. 4 ల‌క్ష‌ల‌కు పైగా ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో అత్య‌ధికంగా పురుష ఓట‌ర్లు ఉండ‌గా రెండో స్థానంలో మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు. ఇదిలా ఉండ‌గా నాలుగు కోట్ల మంది ఈ ఉప ఎన్నిక ఫ‌లితంపై ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంది. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై జోరుగా బెట్టింగ్ లు కూడా జ‌రుగుతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది ప‌క్క‌న పెడితే పెద్ద ఎత్తున నువ్వా నేనా అన్న రీతిలో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ అభ్య‌ర్థుల మ‌ధ్య కొన‌సాగుతోంది.

Maganti Sunitha Vote

ఈ ఉప ఎన్నిక‌లో 25 మంది త‌మ నామినేష‌న్ల‌ను ఉప సంహ‌రించుకున్నారు. మిగ‌తా వారు బ‌రిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున న‌వీన్ యాద‌వ్ బ‌రిలో ఉండ‌గా భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి సంబంధించి మాగంటి సునీత (Maganti Sunitha) పోటీలో ఉండ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి లంకాల దిలీప్ ఉన్నారు. కానీ ప్ర‌ధానంగా పోటీ మాత్రం ఇరువురి మ‌ధ్యే నెల‌కొంది. మంగ‌ళ‌వారం మాగంటి సునీత త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. త‌న‌తో పాటు ఇద్ద‌రు బిడ్డ‌లు, కొడుకుతో క‌లిసి ఓటు వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Also Read : DY CM Pawan Kalyan Clear Update : పాల‌నా ప‌రంగా ఏఐ వినియోగం కీల‌కం

Exit mobile version