Kranthi Goud Sensational : క్రికెట‌ర్ క్రాంతి గౌడ్ కు స‌ర్కార్ ఘ‌న స‌న్మానం

ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత జ‌ట్టులో స‌భ్యురాలు

Hello Telugu - Kranthi Goud Sensational

Hello Telugu - Kranthi Goud Sensational

Kranthi Goud : మ‌ధ్య‌ప్ర‌దేశ్ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్ విజేతగా భార‌త్ అవ‌త‌రించింది. ఈ గెలుపొందిన జ‌ట్టులో కీల‌క‌మైన పాత్ర పోషించింది మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన క్రాంతి గౌడ్ (Kranthi Goud). ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమెకు ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. అంతే కాకుండా ఘ‌న స‌త్కారం చేసింది. త‌న తండ్రి స‌స్పెండ్ కు గుర‌య్యాడు. ఈ సంద‌ర్బంగా త‌న తండ్రికి తిరిగి ఉద్యోగం లో ప‌ని చేసేలా చూడాల‌ని కోరింది క్రికెట‌ర్ క్రాంతి గౌడ్. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని థ‌త‌ర్ పూర్ జిల్లాలోని త‌న స్వ‌స్థ‌లం ఘువారా. బాల్ బాయ్ గా ప్ర‌సిద్ది చెందింది క్రాంతి గౌడ్. ఈ సంద‌ర్బంగా త‌న తండ్రిని కాపాడాల‌ని కోరింది. 2011 -12 నుండి స‌స్పెన్ష‌న్ లో ఉన్నారు త‌న తండ్రి.

Kranthi Goud Growth

క్రాంతి తండ్రిని ప్ర‌భుత్వ సేవ‌లో తిరిగి చేర్చుకునేలా చేసేందుకు అందుబాటులో అన్ని మార్గాల‌ను అన్వేషిస్తామ‌ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ కుటుంబం ఇండియాకు ప్ర‌పంచ ఛాంపియ‌న్ ను త‌యారు చేసింద‌న్నారు. భార‌త జ‌ట్టు విజ‌యంలో క్రాంతి గౌడ్ కీల‌క పాత్ర పోషించింది. స‌న్మాన కార్య‌క్రమంలో త‌న‌తో పాటు కూడా హాజ‌ర‌య‌య్యారు. త‌న స్వంత ఊరులో స్థానిక టెన్నిస్ బాల్ టోర్నీలో బాల్ బాయ్ గా ప‌ని చేసింది. భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కించుకుని ఏకంగా విశ్వ విజేత‌గా నిల‌వ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించింది. ఆరుగురు తోబుట్టువుల‌లో చిన్న‌ది ఈ క్రాంతి. కేవ‌లం ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే చ‌దువుకుంది. ఆ త‌ర్వాత మానేసింది. గెలిచిన త‌ర్వాతే ఇంటికి వెళ్లు అనే ల‌క్ష్యంతో ముందుకు సాగింది.

Also Read : Dr Nageshwar Reddy Growth : డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డికి అరుదైన గౌర‌వం

Exit mobile version