Dr Nageshwar Reddy Growth : డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డికి అరుదైన గౌర‌వం

అంబుజ్ నాథ్ బోస్ బ‌హుమ‌తితో స‌త్కారం

Hello Telugu - Dr Nageshwar Reddy Growth

Hello Telugu - Dr Nageshwar Reddy Growth

Dr Nageshwar Reddy : హైద‌రాబాద్ : ఏఐజీ హాస్పిట‌ల్స్ చైర్మ‌న్ డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డికి (Dr Nageshwar Reddy) అరుదైన పుర‌స్కారం ల‌భించింది. ఆయ‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అంబుజ్ నాథ్ బోస్ బ‌హుమ‌తి వ‌రించింది. ఆరోగ్య రంగంలో విశిష్ట సేవ‌లు అందించినందుకు , శ‌స్త్ర చికిత్స‌లు జ‌రిపినందుకు, విశిష్ట‌మైన , అత్యాధునిక వ‌స‌తుల‌తో ఆస‌ప‌త్రుల నెట్ వ‌ర్క్ ను విస్త‌రించినందుకు త‌న‌కు ఈ అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు స‌ద‌రు సంస్థ వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని శ‌నివారం అధికారికంగా వెల్ల‌డించింది. ఈ ఏడాది 2025కి వ‌రించ‌డం ప‌ట్ల ఆస్ప‌త్రి యాజ‌మాన్యం, సిబ్బంది, ఉద్యోగులు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు.

Dr Nageshwar Reddy Growth

ఇదిలా ఉండ‌గా డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డి సాధించిన ఈ ఘన‌త త‌న ప్ర‌స్థానంలో ఓ మైలు రాయి అని చెప్ప‌క త‌ప్ప‌దు. కాగా 1998లో డాక్ట‌ర్ సి. గోపాల‌న్ ఈ అవార్డును అందుకున్నారు. ఆ త‌ర్వాత సుదీర్ఘ కాలం అనంత‌రం హైద‌రాబాద్ కు చెందిన డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డికి ద‌క్క‌డం విశేషం. ఎండోస్కోపి రంగంలో ఆయ‌న‌కు అశేష‌మైన‌, అపార‌మైన అనుభ‌వం ఉంది. చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా లండ‌న్ లోని రాయ‌ల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియ‌న్ అంబుజ్ నాథ్ బోస్ బహుమ‌తిని ప్రదానం చేసింది . ఈ పుర‌స్కారాన్ని ఆర్సీపీ వార్షిక హార్వియ‌న్ ఓరేష‌ణ్ లో భాగంగా అవార్డును అందుకున్నారు డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డి. 1954లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. దూర‌దృష్టి గ‌ల నాయ‌క‌త్వాన్ని, వైద్య ఆవిష్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు ఏఐజీ హాస్పిట‌ల్స్ చైర్మ‌న్ డాక్ట‌ర్ జి. నాగేశ్వ‌ర్ రెడ్డి.

Also Read : Trump Approved Ohio Governor : ఒహియో గ‌వ‌ర్న‌ర్ గా వివేక్ రామ‌స్వామి

Exit mobile version