LV Subramanyam Shocking Comments : గంట‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం అసంభ‌వం – ఎల్వీ

టీటీడీపై మాజీ సీఎస్ సుబ్ర‌మ‌ణ్యం కామెంట్స్

Hello Telugu - LV Subramanyam Shocking Comments

Hello Telugu - LV Subramanyam Shocking Comments

LV Subramanyam : హైద‌రాబాద్ – ఏపీ మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం సంచ‌ల‌న కామెంట్స్ చేశారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లిపై. తిరుమల‌ శ్రీవారి దర్శనం విష‌యంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. శ్రీవారి ఆలయంలో భ‌క్తుల‌కు సంబంధించి గంటలో స్వామి వారి దర్శనం అనేది జ‌ర‌ద‌ని పేర్కొన్నారు. ఇది అసంభవం అన్నారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేనే లేద‌ని స్ప‌ష్టం చేశారు ఎల్వీ సుబ్ర‌మణ్యం (LV Subramanyam). ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీ ధనాన్నీ వృథా చేయడం మంచిది కాదని హిత‌వు ప‌లికారు.

LV Subramanyam Shocking Comments on TTD

మ‌రో వైపు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి జె. శ్యామ‌ల రావు, ఏఈవో వెంక‌య్య చౌద‌రి , జేఈవో వీర‌బ్రహ్మంతో పాటు టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుల‌తో స‌మావేశం జ‌రిగింది ఇటీవ‌ల ప‌రిపాల‌నా భ‌వ‌నంలో. ఈ సంద‌ర్భంగా ప‌దే ప‌దే ఈవో ఏఐ గురించి ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నారు. నూత‌న టెక్నాల‌జీని టీటీడీ పాల‌నా ప‌రంగా వాడుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం. ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఇదిలా ఉండ‌గా ఆయ‌న గ‌తంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ)కు ఈవోగా ప‌ని చేశారు. కీల‌క‌మైన మార్పులు తీసుకు వ‌చ్చారు. అత్యంత నిజాయితీ ప‌రుడ‌న్న పేరుంది.

గ‌తంలో ఏపీ సీఎస్ గా ప‌ని చేసిన స‌మ‌యంలో మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి వేధింపులు భ‌రించ‌లేక‌, స్వ‌చ్చందంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ప్రస్తుతం ధ‌ర్మ ప్ర‌చారంపై దృష్టి సారించారు ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం.

Also Read : MLC Dasoju Sravan Shocking Comments : కొంద‌రు అధికారులు రేవంత్ కు బానిస‌లు

Exit mobile version