LPG Gas Cylinder Pride Drop : గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..భారీగా తగ్గుముఖం పట్టిన గ్యాస్ సిలిండర్ ధరలు

ఈ ధరలు నేటి నుంచే (జూలై 1) ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి...

Hello Telugu - LPG Gas Cylinder Pride Drop

Hello Telugu - LPG Gas Cylinder Pride Drop

Gas Cylinder : జూలై నెల సామాన్యులకు శుభవార్తతో ప్రారంభమైంది. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (OMCs) ఈరోజు ఉదయం వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు నేటి నుంచే (జూలై 1) ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

Gas Cylinder Price Drop

ప్రతి నెల మొదటివారం రోజున గ్యాస్‌ ధరలను పునఃసమీక్షించే చమురు సంస్థలు, ఈసారి 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.58.50 మేర తగ్గించాయి. ఈ తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.1,723 నుంచి రూ.1,665కి చేరింది. ఇదే విధంగా, ఇతర నగరాల్లో కూడా ధరలు తగ్గించబడ్డాయి. అయితే ఈ తగ్గింపు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్లకే పరిమితం కాగా, గృహ వినియోగానికి ఉన్న 14.2 కేజీల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు.

రాష్ట్రాల వారీగా ధరల్లో తేడా:

మారిన గ్యాస్‌ ధరలు స్థానిక పన్నులపై ఆధారపడి ఉండటంతో, ప్రతి రాష్ట్రంలో వేర్వేరు ధరలుగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు, హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర ఢిల్లీపైనా కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఈ తాజా నిర్ణయం హోటళ్లకు, బేకరీలకు, చిన్న పరిశ్రమలకు ఒక రకంగా ఊరటనిచ్చే అంశంగా మారింది. పెట్రోలు, డీజిల్ ధరలతో పాటు గ్యాస్‌ ధరలు కూడా పెరుగుతుండటంతో, వినియోగదారులపై పెనుబారంగా మారింది. ఈ నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల ధర తగ్గింపు ఉపశమనం కలిగించేలా ఉంది.

Also Read : Today Gold and Silver Price : నేటికీ తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు

Exit mobile version