అమరావతి : ప్రాజెక్టుల గ్రౌండింగ్ ను నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సమస్యలు ఏవైనా ఉంటే కలిసి పరిష్కరిస్తాం అన్నారు మంత్రి నారా లోకేష్. కాబట్టి స్పీడ్ ను ప్రభుత్వ కల్చర్ గా మార్చడం, దానికి క్లస్టర్ ఆధారిత విధానాన్ని జోడించడం.. ఈ రెండూ కలిసి మనం ఈరోజు సాధిస్తున్న విజయాలకు కారణం అవుతున్నాయి. ప్రాజెక్టులను గ్రౌండ్ చేయడం మా ఏకైక ప్రధాన ప్రాధాన్యత. మేం కేవలం ఎంవోయూలపై ఆధారపడబోం. నాకు ఎంవోయూలపై సంతకం చేయడం అంతగా ఇష్టం లేదు. పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో కొన్ని ఎంవోయూలు చేసుకున్నాం. కానీ మేం 80 శాతం గ్రౌండింగ్ లక్ష్యంగా పెట్టుకున్నాం. 80 శాతం కంటే తక్కువ గ్రౌండింగ్ రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదని చెప్పాను. ఎందుకంటే ప్రాజెక్టు ఎంత త్వరగా గ్రౌండ్ అవుతుందో, అంత త్వరగా పన్నులు చెల్లిస్తారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అనే లక్ష్యం మరింత చేరువ అవుతుందన్నారు.
ఎవరూ ఇంకా పెద్దగా దృష్టి పెట్టని, ప్రారంభ దశలో ఉన్న కంపెనీలను గుర్తించి ముందుగానే వాటిపై పెట్టుబడి రూపంలో నమ్మకం ఉంచగలుగుతున్నాం అన్నారు . కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలను కూడా ముందుగానే సంప్రదిస్తున్నామని, రాష్ట్రంగా మేం వారికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పారు. అవసరమైన ప్రక్రియలు సక్రమంగా పూర్తైన తర్వాత ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత వారు తమ సత్తాను చూపిస్తున్నారు. అదే విధానాన్ని ఆర్సెలర్ మిట్టల్ విషయంలో కూడా అనుసరించామని పేర్కొన్నారు. 3 వేల ఎకరాల భూమిని ఇచ్చాం. వారు తమ పనులను ప్రారంభించారు. 17 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. అసాధ్యాన్ని మేం సుసాధ్యం చేశాం. ఆదిత్య మిట్టల్ తో జూమ్ కాల్ నుంచి ప్రాజెక్టు గ్రౌండింగ్ వరకు పట్టిన కాలం 17 నుంచి 18 నెలలు మాత్రమే పట్టిందన్నారు. పర్యావరణ అనుమతులు సహా అన్ని ప్రక్రియలను పూర్తి చేశాం. ఫలితాలపై దృష్టిపెట్టి పనిచేస్తున్నాం. ఇదే మమల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఎందుకంటే స్పీడ్ ఈజ్ మనీ, టైం ఈజ్ మనీ అని స్పష్టం చేశారు నారా లోకేష్.
