నేడే లియోనెల్ మెస్సీ హైద‌రాబాద్ కు రాక

భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశామ‌న్న డీజీపీ

hellotelugu-MesssiGoatToour

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జ ఆట‌గాడు లియోనెల్ మెస్సీ శ‌నివారం హైద‌రాబాద్ కు రానున్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి టీంతో జ‌రిగే ఫ్రెండ్లీ మ్యాచ్ లో త‌ను ఆడ‌నున్నాడు. ఇందు కోసం భారీ ఎత్తున త‌న‌ను ర‌ప్పించేందుకు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు స‌మాచారు. ఇప్ప‌టికే రేవంత్ రెడ్డి ఫుల్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. ముందు నుంచి త‌ను క్రీడాకారుడు . ఆయ‌న‌కు క్రీడ‌ల ప‌ట్ల మ‌క్కువ ఎక్కువ‌. ఇక హైదరాబాద్‌లో మెస్సీ గోట్ టూర్‌కు సంబంధించి భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. స్టేడియం వ‌ర‌కు ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డ‌కుండా ఆంక్ష‌లు విధించారు. రాత్రి 8:05 ఫలక్‌నుమా నుండి ఉప్పల్‌కు సంతోష్‌నగర్ మీదుగా , సికింద్రాబాద్ నుండి ఉప్పల్‌కు హబ్సిగూడ మీదుగా లియోనెల్ మెస్సీ వెళ్లే మార్గాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11.50 గంటల వరకు ఒక మోస్తరు రద్దీ ఉంటుందని అంచనా.

రాచకొండ పోలీసులు ట్రాఫిక్ సలహా జారీ చేశారు.వాహనదారులు ఈ ప్రాంతాలను నివారించాల‌ని, ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు వంటి ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు క‌మిష‌న‌ర్ సుధీర్ బాబు. తార్నాక నుండి ఉప్పల్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ క్రాస్‌రోడ్‌ల వద్ద నాచారం, ఎన్ఎఫ్‌సీ రోటరీ, ఐఓసీఎల్ చెర్లపల్లి , ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు. రామంతపూర్ నుండి ఉప్పల్‌కు వెళ్లే వాహనాలను వీధి నంబర్ 8 వద్ద హబ్సిగూడ క్రాస్‌సోడ్స్, నాచారం, ఎన్ఎఫ్‌సీ రోటరీ, ఐఓసీఎల్ చెర్లపల్లి , ఘట్‌కేసర్ వైపు మళ్లిస్తారు. పది ప్రధాన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు క‌మిష‌న‌ర్. సాధారణ ప్రజల కోసం తొమ్మిది పార్కింగ్ స్థలాలు స్టేడియం నుండి ఒక కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేశామ‌న్నారు.

Exit mobile version