రాజ్య‌స‌భ‌ అభ్యర్థిగా లింగమనేని రమేష్ : జ‌న‌సేన

ప్ర‌క‌టించిన పార్టీ అధ్య‌క్షుడు ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్

hellotelugu-LingamaneniRamesh

అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ చీఫ్ , ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు కూట‌మితో జ‌రిపిన చ‌ర్చ‌ల నేప‌థ్యంలో రాజ్య‌స‌భ స్థానాల‌కు సంబంధించి మూడు టీడీపీ, ఒక సీటు జ‌న‌సేన పార్టీకి కేటాయించారు. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ త‌మ పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థిగా రాజ్య‌స‌భ‌కు లింగ‌మ‌నేని ర‌మేష్ ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపింది. జనసేన పార్టీతో, పవన్ కళ్యాణ్ తో 2015 నుంచి రమేష్ కి అనుబంధం ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత… అందుకు తగ్గ సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులై ఆయన వెన్నంటి ఉన్నారు. శనివారం మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు.

2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా జనసేన సిద్ధాంతాలపైనా, పార్టీ అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ పైనా విశ్వాసం కనపరచి- ఎన్ని ఒత్తిళ్ళు, సవాళ్ళు ఎదురైనా సహనంతో నిలిచిన వారికి నామినేటెడ్ పదవుల్లో కుల, మతాలు పరిగణనలోకి తీసుకోకుండా అవకాశం కల్పించారు. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్ కళ్యాణ్ లింగ‌మ‌నేని ర‌మేష్ ను పరిగణనలోకి తీసుకున్నారు.

లింగమనేని రమేశ్ ఏపీకి చెందిన‌ పారిశ్రామికవేత్త. ఎయిర్ కోస్టాకు చైర్మన్‌గా ఉన్నాడు. 1983లో లింగమనేని ఎస్టేట్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. ఈ సంస్ధ ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. త‌నువిజయవాడలో జన్మించాడు. తన 19వ యేట నుండి తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కార్యక్రమాలలో పనిచేసాడు.

Exit mobile version