కేర‌ళ సీఎం ప్ర‌మాణ స్వీకారంలో నేత‌ల హ‌ల్ చ‌ల్

డీకే శివ‌కుమార్, రేవంత్ రెడ్డి, స‌తీష‌న్ , భ‌ట్టి విక్ర‌మార్క

hellotelugu-CongresssTeamViral

తిరువ‌నంత‌పురం : కేర‌ళ‌లో సోమ‌వారం యుడీఎఫ్ నుంచిన నూత‌న ముఖ్య‌మంత్రిగా వీడీ స‌తీశ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిర‌థ మ‌హార‌థులు హాజ‌ర‌య్యారు. వీరిలో సీఎంలు, డిప్యూటీ సీఎంలు కూడా ఉన్నారు. ఏఐసీసీ పెద్ద‌లు కూడా హాజ‌ర‌య్యారు. స్నేహితులు, స‌హ‌చ‌రుల క‌ల‌యిక అపూర్వ‌మ‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. మధ్యాహ్నం 1:31 గంటలకు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌లతో కలిసి సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏదో ఒక రోజు భారతదేశ ప్రధానమంత్రి అవుతారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన తన అనుభవాన్ని పంచుకున్నారు. స్నేహితులు,సహచరుల కలయికగా అభివర్ణించారు. కేరళలోని వాతావరణం “ఆశ, శక్తి , ఉత్సాహంతో” నిండి ఉందని ఆయన పేర్కొన్నారు. ఏదో ఒక రోజు రాహుల్ జీ పీఎం కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. మనందరి ఉమ్మడి లక్ష్యం కోసం మనం కలిసి పని చేస్తున్నప్పుడు, ఇదే శక్తి మరింత బలపడుతుంది అని రేవంత్ రెడ్డి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.

Exit mobile version