Tiruchanoor Lakshmi Kasula Haram Interesting : ఘ‌నంగా లక్ష్మీ కాసుల హారం శోభా యాత్ర‌

గ‌జ‌, గ‌రుడ వాహ‌నాల్లో అమ్మ‌వారికి అలంక‌ర‌ణ‌

Hello Telugu - Tiruchanoor Lakshmi Kasula Haram Interesting

Hello Telugu - Tiruchanoor Lakshmi Kasula Haram Interesting

Tiruchanoor : తిరుపతి : తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభా యాత్ర శుక్ర‌వారం తిరుచానూరులో వైభ‌వంగా జ‌రిగింది. ముందుగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుండి అద‌న‌పు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరులోని (Tiruchanoor) శిల్పారామం – ప‌సుపు మండ‌పం వద్దకు తీసుకొచ్చారు. అక్క‌డ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత‌రం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడ వీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు.

Tiruchanoor Lakshmi Kasula Haram Sobha Yatra

ఈ సందర్భంగా టీటీడీ (TTD) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల‌లో లక్ష్మీ కాసుల హారం అత్యంత ప్ర‌ధాన‌మైంద‌ని చెప్పారు. పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ సంద‌ర్భంగా ఈ హారాన్ని శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి వారికి అలంక‌రిస్తామ‌ని తెలిపారు. సాక్షాత్తు స్వామి వారు ధ‌రించే ఈ హారాన్ని గజ వాహనం, గరుడ వాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మ వారికి అలంకరించడం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని అన్నారు అనిల్ కుమార్ సింఘాల్. సోమవారం రాత్రి జ‌రుగ‌నున్న గ‌జ వాహ‌నానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసిన‌ట్టు వివ‌రించారు.

అంత‌కు ముందు భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము తిరుమ‌ల‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. గ‌ట్టి భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. మొద‌ట‌గా తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారిని ద‌ర్శించుకుని పూజ‌లు చేశారు. అక్క‌డి నుంచి నేరుగా సెక్యూరిటీ మ‌ధ్య‌న తిరుమ‌ల‌కు చేరుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జేఈఓ వి.వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Also Read : KTR Shocking Comments on Land Scam : 5 లక్షల కోట్ల భూ కుంభకోణం తెరలేపిన సీఎం

Exit mobile version