KTR Shocking Comments on Land Scam : 5 లక్షల కోట్ల భూ కుంభకోణం తెరలేపిన సీఎం

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - KTR Shocking Comments on Land Scam

Hello Telugu - KTR Shocking Comments on Land Scam

KTR : హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. ఏకంగా 5 ల‌క్ష‌ల కోట్ల భూ స్కాంకు తెర లేపాడ‌ని అన్నారు. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హెచ్‌ఐఎల్‌టీపీ విధానం పేరిట దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్‌కు కుట్ర ప‌న్నాడ‌ని ఆరోపించారు. ఇది పాలసీ కానే కాద‌ని, భారీ కుంభ‌కోణంగా పేర్కొన్నారు. లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్ప చెప్పేందుకు శ్రీ‌కారం చుట్టాడ‌ని అన్నారు. ఒకప్పుడు ప్రజల వద్ద పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న భూమిని, ప్రభుత్వం రాయితీలతో ఇచ్చిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాడ‌ని అన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ పాలసీని రద్దు చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. మార్కెట్ విలువ అనేక రెట్లు ఎక్కువ ఉన్న ఈ భూములను, కేవలం 30% ఎస్ఆర్ఓ రేట్లకి రెగ్యులరైజ్ చేయడం అవినీతికి నిదర్శనం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు కేటీఆర్.

KTR Slams CM Revanth Reddy

ఇది కేవలం సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, అనుచరుల కోసమే తీసుకు వచ్చిన పాలసీ అని ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం కాద‌న్నారు. రేవంత్ అవినీతి కోసం ఇప్పుడు ఇందులో పాలుపంచుకుంటే తాము వ‌చ్చాక వాటిని త‌ప్ప‌కుండా ర‌ద్దు చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP) పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ఇది కేవ‌లం స్కాం చేసేందుకు ఉద్దేశించిన పాల‌సీగా ఆయ‌న ఆరోపించారు . దీనిని భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా అభివర్ణించారు కేటీఆర్, ఈ విధానం ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : Krishna Water – YS Jagan Shocking Comments : కృష్ణా జ‌లాల వినియోగంపై జ‌గ‌న్ కామెంట్స్

Exit mobile version