ఇరుముడి చిత్ర నిర్మాత‌ల‌కు కార్మిక శాఖ నోటీస్

మూవీలో మైన‌ర్ బాలిక న‌టించ‌డంపై ఆదేశాలు

helloteelugu-IrumudiNotice

హైద‌రాబాద్ : శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ న‌టించిన ఇరుముడి చిత్రం సంచ‌ల‌నం సృష్టించింది. ర‌వితేజ త‌న సినీ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. అయితే ఉన్న‌ట్టుండి సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల త‌ర్వాత తెలంగాణ కార్మిక శాఖ స్పందించింది. ఇరుముడి’ చిత్ర నిర్మాతలలకు మంత్రి వివేక్ ఆధ్వర్యంలోని కార్మిక శాఖ నోటీసులు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం ఈ స‌మ‌స్య చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ఇదిలా ఉండ‌గా ఈ చిత్రంలో ఒక మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించినందుకు ఈ నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలిపింది. చిత్రీకరణలో ఆ బాలిక పాల్గొనే ముందు జిల్లా మెజిస్ట్రేట్ నుండి అనుమతి తీసుకున్నారా? అని ప్ర‌శ్నించింది.

అలాగే ఆ ​​బాలిక తల్లిదండ్రుల నుండి అధికారిక సమ్మతి పత్రం తీసుకున్నారా అని తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ చిత్ర బృందాన్ని కోరారు. ఆ బాలికకు సంబంధించిన కాల్ షీట్లు, హాజరు రికార్డులు, షూటింగ్‌లో పని చేసిన గంటల వివరాలు, ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, ఆమె భద్రత కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా లేదా అనే అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బాలికకు చెల్లించిన పారితోషికంలో 20 శాతాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా లేదా అని, అలాగే ఆమెను సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో, ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో పాల్గొనేలా చేశారా లేదా అనే విషయాలపై వివరణ కోరారు.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో నవంబర్ 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని కార్మిక శాఖ అధికారులు చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేశారు.

Exit mobile version