‘ఆద‌ర్శ కుటుంబం’ క‌లెక్ష‌న్స్ రూ. 75 కోట్లు

అధికారికంగా ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

hellotelugu-AdarshaKutumbhamCollections

హైద‌రాబాద్ : మాట‌ల మాంత్రికుడు, టాప్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఆద‌ర్శ కుటుంబం. నువ్వు నాకు న‌చ్చావ్ మూవీ త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ తో పూర్తి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఎప్ప‌టి లాగే త్రివిక్ర‌మ్ మాట‌ల‌తో మైమ‌రిచి పోయేలా చేశాడు. ఆరంభంలో మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా ఆ త‌ర్వాత వ‌సూళ్ల ప‌రంగా పుంజుకుంది. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే విక్ట‌రీ వెంక‌టేష్ ఈ సినిమాను త‌న భుజాల‌పై మోశాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. స‌క్సెస్ ఫెయిలూర్ గురించి అస్స‌లు పట్టించుకోని మ‌న‌స్త‌త్వం. క‌థ‌లు విన‌డం, న‌చ్చితే వెంట‌నే ఓకే చెప్ప‌డం, ఆ త‌ర్వాత షూటింగ్ లోకి వెళ్ల‌డం ఇది త‌ను ప్ర‌స్తుతం ప‌నిగా పెట్టుకున్నారు. ముందుకు సాగుతున్నారు. ఈ సినిమా విడుద‌ల కాగా మ‌రో వైపు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌వ‌రి 12 విడుద‌ల షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఆద‌ర్శ కుటుంబం విష‌యానికి వ‌స్తే కీల‌క అప్ డేట్ వ‌చ్చింది.

చిత్ర నిర్మాత‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకు పోతోంద‌ని వెల్ల‌డించారు ఈ సినిమాకు సంబంధించి తాజా కలెక్షన్ వివరాలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో, ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 75 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, తదుపరి మైలురాయి వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. కేవలం 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసింద‌ని ప్ర‌క‌టించారు.

విడుదల చేసిన తాజా కలెక్షన్ పోస్టర్‌లో వెంకటేష్, శ్రీనిధి, ప్రజ్వల్ , యువిన పార్థవి ఆధునిక దుస్తుల్లో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. కథ విషయానికి వస్తే, ఇందులో త్రివిక్రమ్ మార్కు సంభాషణలు (వన్-లైనర్స్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘చిట్టి బాబు’ పాత్రలో వెంకటేష్, ఇంటి పనులతో విసి గిపోవడం, అతని కుమారుడు సర్వ చదువులో వెనుకబడటం, భార్య స్వర్ణ ఇతరులకు అప్పులు ఇచ్చే అలవాటు కలిగి ఉండటం వంటి అంశాలు కథలో హాస్యాన్ని పండిస్తాయి. అయితే, అకస్మాత్తుగా లభించిన ఒక భారీ మొత్తం వారి జీవనశైలిని మార్చేయడమే కాకుండా, వారిని విలన్లతో పోరాడేలా చేస్తుంది.

Exit mobile version