క‌ల్వ‌కుంట్ల క‌విత అక్ర‌మాలు బ‌య‌ట పెడ‌తా

కూక‌ట్ ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు

hellotelugu-MadhavaramKrsshnaRAo

హైద‌రాబాద్ : త‌న‌ను టార్గెట్ చేస్తూ సీరియ‌స్ కామెంట్స్ చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత పై భ‌గ్గుమ‌న్నారు కూక‌ట్ ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు . మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌విత‌ను ఏకి పారేశారు. ఆమెను కుక్క‌తో పోల్చారు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. నీ లాంటి కుక్కలను మస్తు మందిని చూసాన‌ని, నీకు ఎవడు భయపడతాడని మండిప‌డ్డారు. కవిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ కూకట్‌పల్లి ఎమ్మెల్యే . తెలంగాణ పేరుతో నువ్వు చేసిన అక్రమాలు, నీ మొగుడి అవినీతి గురించి బ‌య‌ట‌కు తీస్తే నువ్వు త‌ట్టుకోలేవ‌ని అన్నారు. నోరు మూసుకుని కూర్చుంటే మంచిద‌ని క‌విత‌కు హిత‌వు ప‌లికారు. కేవ‌లం త‌మ అధినాయ‌కుడు కేసీఆర్ ముఖం చూసి ఊరుకున్నామ‌ని కానీ ఇంకోసారి గ‌నుక నోరు పారేసుకుంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

నీ గురించి రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. ఆనాడు మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికి తెలుసన్నారు. ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ఎవ‌రి ప్ర‌యోజనాల కోసం నువ్వు ప‌ని చేస్తున్నావో ముందు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు మాధ‌వ‌రం కృష్ణా రావు. ఆనాడు నీ అత్త గారి ఊర్లో నీకు గెలవడం చేతకాలేదని అన్నారు. ఇప్పుడు నా గురించి మాట్లాడేంత ధైర్యం ఎలా వ‌చ్చిందంటూ ప్ర‌శ్నించారు. నా జోలికి వ‌స్తే ఊరుకోన‌ని హెచ్చ‌రించారు. కేటీఆర్, హరీష్ రావులను జైలుకు పంపాలని రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర చేస్తున్న సంగతి మాకు తెల్వదు అనుకున్నావా అని మండిపడ్డారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు నీ అక్రమాలు తీస్తే తల ఎక్కడ పెట్టుకుంటావు అని నిప్పులు చెరిగారు.

Exit mobile version