hero Rajinikanth Coolie : విజిల్స్ వేయిస్తున్న కూలీ మౌనిక సాంగ్

దుమ్ము రేపిన ల‌వ్లీ బ్యూటీ పూజా హెగ్డే

hellotelugu-cooliemonicasong

Coolie : కోలీవుడ్ లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది. ఆ పేరు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. త‌న వ‌యసు 70 ఏళ్ల‌కు పైగానే. కానీ త‌ను స్టార్ హీరోల‌ను కాద‌ని ముందంజ‌లో కొన‌సాగుతున్నాడు. ఓ వైపు త‌ళ‌ప‌తి విజ‌య్ ని తోసేసి క‌మ‌ల్ హాస‌న్ ను వెన‌క్కి నెట్టేసి త‌న రేంజ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌ని నిరూపించాడు. త‌ను న‌టించిన జైల‌ర్ దుమ్ము రేపింది. కోట్ల వ‌ర్షం కురిపించింది. ఆశించిన దానికంటే అత్య‌ధికంగా డ‌బ్బులు రావ‌డంతో ఏకంగా స‌న్ పిక్చ‌ర్స్ బ‌హిరంగంగానే చెక్కును అందించింది . ఔరా అనిపించేలా చేసింది.

Coolie Movie Updates

తాజాగా ఇదే సంస్థ భారీ నిర్మాణంతో చేప‌ట్టిన చిత్రం కూలీ (Coolie). ఇది వ‌చ్చే ఆగ‌స్టు 14న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌న టైమ్ ను ఎక్కువగా ఈ మూవీ కోసం పెట్టాడు. ర‌జ‌నీకాంత్ సినీ కెరీర్ లో అతి పెద్ద రికార్డ్ సృష్టించింది ఈ మూవీ . ఈ చిత్రం విదేశీ హ‌క్కులు ఏకంగా రూ. 80 కోట్ల‌కు పైగా అమ్ముడు పోయాయి. ఇది త‌న సినిమా రేంజ్ ఏమిటో చెప్ప‌క‌న చెబుతుంది. ఇక తాజాగా సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది.

తాజాగా కూలీ (Coolie) సినిమా నుంచి స్పెష‌ల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. ఇందులో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఈ పాట‌ను కృష్ణ‌కాంత్ రాయ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్, సుహాంస‌న పాడారు. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ తో దూసుకు పోతోంది. ఈ పాట సినిమాకు ప్ల‌స్ పాయింట్ కానుంది. అద్భుతంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్. మంచి ఊపు తీసుకు వ‌చ్చేలా కంపోజ్ చేశాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్. త‌ను కావ్య మారన్ తో డేటింగ్ లో ఉన్నాడ‌ని టాక్. మొత్తంగా కూలీ రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు న‌మోదు చేస్తుందో వేచి చూడాలి.

Also Read : Hero Ram Charan-Peddi Movie : గౌరి నాయుడుగా శివ రాజ్ కుమార్

Exit mobile version