Hero Dhanush-Kuberaa Piracy : కుబేర సినిమా పైర‌సీ సైబ‌ర్ క్రైమ్ కు ఫిర్యాదు

ఫిర్యాదు చేసిన మూవీ మేక‌ర్స్ తో క‌ల‌క‌లం

Hello Telugu - Hero Dhanush-Kuberaa Piracy

Hello Telugu - Hero Dhanush-Kuberaa Piracy

Kuberaa : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కుబేర‌. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యింది. ఏకంగా రూ. 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది ఈ మూవీ. ఇందులో టాలీవుడ్ అంద‌గాడు అక్కినేని నాగార్జున‌, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ , నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించారు. ప్ర‌ధానంగా ధ‌నుష్ బిచ్చ‌గాడి పాత్ర కు మంచి మార్కులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఓటీటీకి స్ట్రీమింగ్ కోసం సిద్ద‌మైంది.

Kuberaa Movie Piracy Complaint

తాజాగా కుబేర (Kuberaa) సినిమాకు సంబంధించి పైర‌సీ చోటు చేసుకున్న‌ట్లు ఫిర్యాదు చేశారు మూవీ మేక‌ర్స్.
పైరసీపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ఎఫ్‌సీ) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో యాంటీ వీడియో పైర‌సీ సెల్‌, క్యూబ్ డిజిట‌ల్ సినిమా పైర‌సీ మూలాల‌ను గుర్తించ‌డానికి వాట‌ర్ మార్కింగ్ టెక్నాల‌జీల‌ను ఉప‌యోగిస్తూ పైర‌సీని అడ్డుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింద‌ని ఫిల్మ్ ఛాంబ‌ర్‌ ఫిర్యాదులో పేర్కొంది.

పైరసీ అనేది చలనచిత్ర పరిశ్రమకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇది నిర్మాతలకు, దర్శకులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తుందని అభిప్రాయ ప‌డింది. పైరసీ వల్ల సినిమాలు థియేటర్లలో విడుదలైన వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులోకి వస్తాయి, ఇది బాక్సాఫీస్ వసూళ్లను దెబ్బ తీస్తుందని వాపోయింది ఒకవేళ మీరు ఎవ‌రైనా ‘కుబేర’ సినిమా పైరసీని లేదా మరే ఇతర సినిమా పైరసీని గమనిస్తే, మీరు కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చ‌ని తెలిపింది ఆన్‌లైన్‌లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (https://cybercrime.gov.in/) ద్వారా లేదా నేరుగా మీ దగ్గర్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చ‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : Hero Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కు స‌ర్కార్ గుడ్ న్యూస్

Exit mobile version