Hero Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కు స‌ర్కార్ గుడ్ న్యూస్

సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు గ్రీన్ సిగ్న‌ల్

Hello Telugu - Hero Pawan Kalyan

Hello Telugu - Hero Pawan Kalyan

Pawan Kalyan :  హైద‌రాబాద్ – ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, నిధి అగ‌ర్వాల్ క‌లిసి న‌టించిన చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రం ఈనెల 24న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా చిత్ర నిర్మాత ఎంఎం ర‌త్నం ఇటు ఏపీ స‌ర్కార్ కు అటు తెలంగాణ ప్ర‌భుత్వానికి త‌మ సినిమాకు సంబంధించి టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని విన్న‌వించారు. ఈ మేర‌కు తీపిక‌బురు చెప్పింది ఇప్ప‌టికే టీడీపీ కూట‌మి నేతృత్వంలోని కూట‌మి స‌ర్కార్. భారీ ఎత్తున టికెట్ ధ‌ర‌లు పెంచేలా ఛాన్స్ ఇచ్చింది. దీంతో త‌మ అభిమాన నాయ‌కుడి సినిమా హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీని చూడాల‌ని అనుకున్న ఫ్యాన్స్ కు బిగ్ షాక్ త‌గిలింది.

AP Govt Good News to Pawan Kalyan Fans

తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) కు సంతోషం క‌లిగించేలా భారీగా సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు వీలు క‌ల్పించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంతే కాకుండా సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటల షోల‌కు అనుమతి ఇచ్చింది రేవంత్ స‌ర్కార్. ముందు రోజు రాత్రి షోకు టికెట్ ధర రూ.600గా నిర్ణ‌యించింది. సినిమా విడుదల రోజు నుండి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.150 వరకు పెంచింది. 28 నుండి ఆగస్టు 02 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.106 వరకు పెంచుకునేందుకు అనుమతిచ్చింది స‌ర్కార్.

Also Read : Kerala Ex CM Achuthanandan Death : అరుదైన ప్ర‌జా నాయ‌కుడు అచ్యుతానంద‌న్

Exit mobile version