KTR Strong Support : ఆటో డ్రైవ‌ర్ల‌కు కేటీఆర్ సంఘీభావం

జూబ్లీహిల్స్ నుంచి తెలంగాణ భ‌వ‌న్ కు

Hello Telugu - KTR Strong Support

Hello Telugu - KTR Strong Support

KTR : హైద‌రాబాద్ : స‌మ‌స్య‌లతో స‌త‌మ‌తం అవుతున్న ఆటో డ్రైవ‌ర్ల‌కు పూర్తిగా సంఘీభావం ప్ర‌క‌టించారు మాజీ మంత్రి కేటీఆర్. సోమ‌వారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్ర‌యాణం చేశారు. అనంతరం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆటో యూనియన్ నాయకులు. ఆటో డ్రైవర్ల దయనీయ పరిస్థితిని కేటీఆర్‌ (KTR) వివరించారు . తాను ప్రయాణించిన ఆటో డ్రైవర్‌ మస్రత్‌ అలీ ఎన్నో విషయాలను చెప్పారని అన్నారు. మస్రత్‌ అలీకి రెండు ఆటోలు ఉండేవి, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని అమ్మాల్సి వచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. ఇప్పుడాయన రోజుకు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలకే సంపాదిస్తున్నారని వెల్లడించారు. అందులో ఆటో కిరాయి నాలుగు వేలు కట్టాల్సి వస్తోందని, ఇక‌ పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదని మస్రత్‌ అలీ బాధపడినట్లు చెప్పారు.

KTR Supports

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇప్పటి వరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు కేటీఆర్‌. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఉన్న రూ.5 లక్షల యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. మూడు రంగుల జెండా కింద ఆటో అన్నల మూడు చక్రాలు నలిగి పోయాయని వాపోయారు. ఇప్పుడు తెలంగాణలో ఆహనా పెళ్లంటా సినిమా లా పరిస్థితి ఉందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Also Read : CM Chandrababu Cyclone Warning : తుపాను ప్ర‌భావంపై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Exit mobile version