KTR Challenge for Farmers : రైతుల సమస్యలు తీరేదాకా పోరాటం ఆగదు

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్

Hello Telugu - KTR Challenge for Farmers

Hello Telugu - KTR Challenge for Farmers

KTR : ఆదిలాబాద్ జిల్లా : రాష్ట్రంలో ప‌త్తి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఘోరంగా వైఫ‌ల్యం చెందింద‌ని మండిప‌డ్డారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). కేంద్ర స‌ర్కార్ మొద్దు నిద్ర పోతోంద‌ని, ఒత్తిడి చేయ‌కుండా సీఎం రేవంత్ రెడ్డి చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డంపై ఫోక‌స్ పెట్టారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ వైపు రైతులు నానా తంటాలు ప‌డుతుంటే మ‌రో వైపు బాధ్య‌త క‌లిగిన మంత్రులు గాలిమోటార్ల‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఏదో ఒక రోజు రైతుల చేతుల్లో చీవాట్లు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు కేటీఆర్.

KTR Challenge

ఇదిలా ఉండ‌గా త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మాజీ మంత్రి ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్ట‌ణంలోని మార్కెట్ యార్డును సంద‌ర్శించారు. అక్క‌డ మొక్కజొన్న‌, ప‌త్తి, సోయాబీన్స్ ధాన్యం తీసుకు వ‌చ్చిన రైత‌న్న‌ల‌తో మాట్లాడారు. వారి గోస విన్నారు. త‌మ‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించ‌డం లేదంటూ బాధిత రైతులు వాపోయారు. వారికి పూర్తి భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు కేటీఆర్. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దిగి వ‌చ్చేంత వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని ప్ర‌క‌టించారు. అనంత‌రం పత్తి కొనుగోలు మరింత వేగవంతం చేయాలని సీసీఐ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. వెంట‌నే ప్ర‌భుత్వం అన్న‌దాత‌ల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు కేటీఆర్.

Also Read : Adluri Lakshman Interesting Comments : డ్ర‌గ్స్ ర‌హిత రాష్ట్రంగా తెలంగాణ : అడ్లూరి ల‌క్ష్మ‌ణ్

Exit mobile version