KTR : హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక ప్రకటన చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఓడి పోవడంపై స్పందించారు. పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ ఓట్లు సంపాదించామన్నారు. ఓడి పోయిన చోట గెలిచి చూపించాలన్నారు. త్వరలో హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కు ఎన్నికలు రాబోతున్నాయని, ఇందులో మనం సత్తా చాటాలని, ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు కేటీఆర్. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, దానిని లైట్ గా తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు.
Ex Minister KTR Challenge
ప్రధానంగా పార్టీ సభ్యత్వంపై ఎక్కువగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో సింగిల్‌గా కొట్లాడినం అన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి పోయాయని, ఇలా దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. ఒక్క గులాబీ పార్టీని ఎదుర్కొనేందుకు ఒక్కటి కావడం వల్లనే మనం ఓడి పోవాల్సి వచ్చిందన్నారు. లేక పోతే గెలిచి ఉండేవాళ్లం అన్నారు కేటీఆర్. ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదలం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉప ఎన్నికలో టెక్నికల్‌గా కాంగ్రెస్ గెలిచినా నైతిక విజయం బీఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన దౌర్జన్యం, అరాచకాలను కార్యకర్తలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు.
Also Read : IPL Top Sixers Interesting : ఐపీఎల్ లో సిక్సర్ల మొనగాళ్లు
