KTR : హైదరాబాద్ : మోసానికి చిరునామా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజలకు సీఎం చేసిన మోసం బాగా అర్థమైందన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందంటూ ప్రశ్నించారు. మంగళవారం జూబ్లీ హిల్స్ లో ఆయన పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై తీవ్ర కోపంతో ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిప్పికొట్టడం ఖాయం అన్నారు. భార్యకు ఫ్రీ బస్సు ఇచ్చి, భర్తకు డబుల్ రేటు, పిల్లల బస్ పాస్‌ల చార్జీలు పెంచడం దారుణమన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడమే రేవంత్ రెడ్డి ‘ఇన్నోవేటివ్ థింకింగ్స అంటూ ఆరోపించారు.
KTR Slams Congress Govt
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు కేటీఆర్ (KTR). పోయినసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఒకలా ఫలితాలు వస్తే, హైదరాబాద్‌లో మాత్రం ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా, అన్నీ సీట్లు బీఆర్‌ఎస్ పార్టీకే ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఆనాటికీ ఈనాటికీ మీరు పోలిస్తే, వాతావరణం ఇంకా మెరుగైందని, 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఇంకా బాగా అర్థమైందని కేటీఆర్ స్పష్టం చేశారు.22 నెలల్లో కొత్త రోడ్లు వేయడం, కొత్త బ్రిడ్జిలు కట్టడం కాదు కదా, ఉన్న రోడ్లను కూడా కనీసం మెయింటైన్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు.
Also Read : YS Jagan Anakapalli Tour Important Update : జగన్ పర్యటనకు కండీషన్స్ అప్లై
















