KTR : హైదరాబాద్ : ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చి అడ్డగోలుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). ముందస్తు సమాచారం లేకుండానే ప్రజలపై ఆర్టీసీ ఛార్జీల భారం మోపిందని ప్రశ్నించారు. తాము ఫ్రీ బస్సు స్కీంకు వ్యతిరేకం కాదన్నారు. ఆర్టీసీ ప్రజలదని ,దానిని నిర్వహించాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందన్నారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ వైపు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా గుర్తిస్తామని మాయ మాటలు చెప్పింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
KTR Slams Congress Govt
లోపాయికారిగా ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. కానీ బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రూ. 1353 కోట్ల బకాయిలు ఉన్నాయని ఎండీ నాగిరెడ్డి తెలిపారని, వెంటనే ఆ బకాయిలను సర్కార్ మంజూరు చేయాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని, ఇలా ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. నెలకు రూ. 30 కోట్ల ఆదాయం కార్గో ద్వారా వస్తే దానిని ప్రైవేట్ సంస్థకు రూ. 3 కోట్లకు అప్పజెప్పడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
Also Read : Minister Satyakumar Yadav Interesting Comments : మైనార్టీల సంక్షేమానికి సర్కార్ పెద్దపీట
