భారతదేశ విమానయానం అస్త‌వ్య‌స్తం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

hellotelugu-KTR

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భార‌త దేశానికి చెందిన విమానయానం అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మొత్తం ఇండిగో, ఎయిర్ ఇండియా ఇద్దరి చేతిలోనే ఉండి పోయిందని భ‌గ్గుమ‌న్నారు. గత 5 రోజుల నుండి ఎయిర్‌పోర్టుల‌న్న రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్ల కంటే అధ్వానంగా మారాయంటూ వాపోయారు. కొంత మంది చేతుల్లోనే శక్తి కేంద్రీకృతం అయితే జరిగే దుష్పరిణామాలకు గొప్ప ఉదాహరణ ఇదని అన్నారు.

శ్రమ దోపిడి చేయొద్దు, పైలెట్ వారానికి ఇంత సమయం మాత్రమే నడపాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంవత్సరం కింద ఒక రూల్ తెచ్చిందని గుర్తు చేశారు. శ్రమ దోపిడి చేయొద్దని కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్పినా ఇండిగో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌లేద‌న్నారు. నిన్న ఒక్క రోజు ఇండిగో సంస్థవి 1000 విమానాలు రద్దు అయ్యాయ‌ని, ఎయిర్ పోర్టుల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా దెబ్బకు కేంద్ర మంత్రిత్వ శాఖ పెట్టిన రూల్ ను వాళ్ళే వెనక్కి తీసుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

Exit mobile version