KTR : హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటికే ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పువెలువరించింది. ఆయనతో పాటు ఎమ్మెల్యే వివేకానంద్ కూడా పార్టీ గుర్తుపై గెలుపొంది, అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, తిరిగి వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దావా దాఖలు చేశారు. మూడు నెలల లోపు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కినట్లు అవుతుందని భారత దేశ సర్వోన్నత ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ షాకింగ్ తీర్పు చెప్పారు. స్పీకర్ కు విశేష అధికారాలు ఉన్నప్పటికీ దీనినే ఆసరాగా తీసుకుని ఎమ్మెల్యేలు వాయిదా వేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
KTR visit Supreme Court
ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోక పోతే, లేదా తాత్సారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో ఆ 10 మంది ఎమ్మెల్యేలపై తప్పనిసరిగా వేటు పడే అవకాశం ఉంది. దీనిపై పూర్తిగా ఆలోచించిన మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీ (శాసన మండలి సభ్యులు) లపై కూడా అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన MLCలనూ అనర్హులుగా ప్రకటించాలంటూ కోరనున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల మేటర్‌లో న్యాయపోరాటం చేస్తోంది భారత రాష్ట్ర సమితి పార్టీ. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
Also Read : Passengers Fired on TGSRTC : పండుగ పేరుతో ఆర్టీసీ నిలువు దోపిడీ















