TGSRTC : ప్రయాణీకుల సంక్షేమానికి పాటు పడాల్సిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణీకుల పట్ల భారంగా మారుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఇందులో ప్రయాణం చేస్తున్న పురుష ప్రయాణీకులకు షాపంగా మారింది. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తోంది. దీంతో నష్టాలు వస్తున్నాయనే సాకుతో ఆర్టీసీ అడ్డగోలుగా పెంచుకుంటూ పోతోంది. ఎక్కడా పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం కానీ, ఎండీ సజ్జనార్ ప్రకటన కానీ చేయకుండానే బాదుతున్నారు. టికెట్ ధరలు పెంచుతూ మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పండుగల పేరుతో ఈ బాదుడు దారుణంగా ఉందంటున్నారు ప్రయాణీకులు.
Passengers Slams TGSRTC
ఆగస్టు 9న శనివారం రాఖీ పండుగ. దీనిని అడ్డం పెట్టుకుని అడ్డంగా పెంచింది ఆర్టీసీ. ఏకంగా సాధారణ టికెట్ ధరపై 30 శాతం అదనంగా బాదింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తూ ప్రభుత్వం పెంచిన టికెట్ ధరలతో తమపై భారం మోపిందని అనేక మంది పురుష ప్రయాణికులు ఆరోపించారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ ప్రయాణీకుడు పెంచిన ఛార్జీని పంచుకున్నాడు. ఇదేమిటంటూ ప్రశ్నించాడు. కామారెడ్డి నుండి హైదరాబాద్‌కు తన డీలక్స్ బస్సు టికెట్ ఫోటోను షేర్ చేశాడు, మేలో రూ. 210 నుండి జూన్‌లో రూ. 230కి, ఇప్పుడు ఆగస్టులో రూ. 300కి పెరిగిందని పేర్కొన్నాడు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చాడు.
కేవలం 60 రోజుల్లోనే ఛార్జీలు రూ. 90 పెరిగాయని ఆయన హైలైట్ చేశారు. టీజీఎస్ఆర్టీసీ, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశాడు. ప్రభుత్వం ఒక చేత్తో ఉచితాలు ఇస్తూ, మరొక చేత్తో దోచుకుంటోందంటూ ఆరోపించారు. వాస్తవ ధర కంటే మూడు రెట్లు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ ప్రశ్నించాడు.
Also Read : Trump Important Meet to Putin : 15న అలస్కాలో పుతిన్ తో ట్రంప్ భేటీ













