KTR Gets Important Invitation : ప్రపంచ సమావేశానికి కేటీఆర్ కు ఆహ్వానం

ఆయ‌న‌కు వ‌రుస‌గా రెండో ఇన్విటేష‌న్

Hello Telugu - KTR Gets Important Invitation

Hello Telugu - KTR Gets Important Invitation

KTR : హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (KTR)కు గ్లోబ‌ల్ ప‌రంగా మ‌రో ఆహ్వానం అందింది. నవంబర్ 6 నుండి 7 వరకు పూణేలోని MIT వరల్డ్ పీస్ యూనివర్సిటీలో జరగనున్న వరల్డ్ సమ్మిట్ 2025 కు హాజ‌రు కావాల్సిందిగా కోరారు నిర్వాహ‌కులు. ముంబై లోని పుణేలోని MIT వరల్డ్ పీస్ యూనివర్సిటీ (MIT-WPU) అనేది విద్య, పరిశోధన, ప్రపంచ శాంతి, సమగ్ర అభివృద్ధికి సంబంధించిన చొరవలపై దృష్టి సారించే ఒక ప్రైవేట్ సంస్థ. ఈ సంద‌ర్బంగా త‌న‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కేటీఆర్. ఈ మేర‌కు తాను హాజ‌రు కానున్న‌ట్లు వారికి స‌మాచారం కూడా ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.

KTR Gets Grand Welcome

ఓ వైపు జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేటీఆర్ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న రోడ్ షోలు ప్రారంభించారు. అక్టోబ‌ర్ 31న శుక్ర‌వారం జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని షేక్ పేట్ లో ప్రారంభించారు. ఈ రోడ్ షోలు ఈనెల 9వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఇదిలా ఉండ‌గా రోడ్ షోలు , ర్యాలీలు నిర్వ‌హించిన అనంత‌రం భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ఆధ్వ‌ర్యంలో 9వ తేదీన భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే బీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు మాజీ మంత్రిని ఆహ్వానిస్తున్నాయి. ఇటీవ‌లే ఆయ‌న త‌మిళ‌నాడులో జ‌రిగిన ఆటోమొబైల్స్ ఎగ్జిబిష‌న్ లో పాల్గొన్నారు.

Also Read : TTD EO Anil Kumar Interesting Update : శ్రీ‌వారి సేవ‌ను బ‌లోపేతం చేయాలి : ఈవో సింఘాల్

Exit mobile version