TTD EO Anil Kumar Interesting Update : శ్రీ‌వారి సేవ‌ను బ‌లోపేతం చేయాలి : ఈవో సింఘాల్

డిసెంబ‌ర్ నెల‌లో సేవ‌ల‌కు మెరుగైన శిక్ష‌ణ ఇవ్వాలి

Hello Telugu - TTD EO Anil Kumar Interesting Update

Hello Telugu - TTD EO Anil Kumar Interesting Update

TTD EO : తిరుమల : శ్రీ‌వారి సేవ‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ (TTD) ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని ఈవో ఛాంబ‌ర్ లో శ్రీ‌వారి సేవ‌పై అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి, జేఈవో వీర‌బ్ర‌హ్మంల‌తో క‌ల‌సి ఆయ‌న స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు చక్కటి సేవలు అందించవచ్చని చెప్పారు. అదే విధంగా ఐఐఎం , రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖకు సంబంధించిన ముఖ్యమైన శిక్షకులతో నవంబర్ నెలలో శిక్షణకు సంబంధించి ఆడియో, వీడియో విజువల్స్, ట్రైనింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలన్నారు. ఇదివరకే ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న గ్రూప్ సూపర్వైజర్లు, ట్రైనర్లకు డిసెంబర్, జనవరి మాసాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.

TTD EO Anil Kumar Singhal

ఈ శిక్ష‌ణ‌ లో శ్రీ వేంకటేశ్వర వైభవం, తిరుమల సమాచారం, సనాతన ధర్మం, విలువలు, మేనేజ్మెంట్, లీడర్ షిప్, సేవ తత్పరత తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు ఈవో. తిరుపతి, తిరుమలలో ఉన్న టీటీడీ (TTD) ఆస్పత్రుల్లో ముఖ్యంగా అశ్వినీ ఆసుపత్రి, ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేందుకు శ్రీవారి వైద్య సేవను త్వరలోనే ప్రారంభించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి శ్రీవారి వైద్య సేవా సెల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు . అదేవిధంగా ఎస్వీ గో సంరక్షణశాలలో కూడా శ్రీవారి సేవకులు గో సేవను చేయడానికి వీలుగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోని టీటీడీ ఆలయాల్లో శ్రీవారి సేవా సేవకులతో భక్తులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్, వైజాగ్, కన్యా కుమారి, బెంగుళూరు లాంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి ఆలయాల్లో మొదటి విడతగా శ్రీవారి సేవ ప్రారంభించాలని, తదనంతరం మిగతా ఆలయాల్లో కూడా దశల వారీగా శ్రీవారి సేవను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సీపీఆర్వో డాక్టర్ టి.రవిని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఐటి జీఎం ఫ‌ణి కుమార్ నాయుడు, బ‌ర్డ్ ఆసుప‌త్రి డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ జ‌గ‌దీష్‌, స్విమ్స్ డైరెక్ట‌ర్ ఆర్‌.వి.కుమార్‌, పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాధ్ రెడ్డి, చీఫ్ మెడికల్ డాక్టర్ నర్మద, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు దీక్షిత్, ఐఐఎం ప్రతినిధులు, రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

Also Read : K Kavitha Fired on Congress Govt : అన్న‌దాత‌ల ఆందోళ‌న క‌విత ఆవేద‌న

Exit mobile version