KTR : హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అవినీతికి కేరాఫ్ గా మారిందన్నారు. తెలంగాణను తాము వ్యవసాయ రంగంలో దేశంలోనే నెంబర్ వన్ చేశామన్నారు. కానీ సర్కార్ వచ్చాక రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకు వచ్చిందన్నారు.రాజకీయ జీవితంలో ఇంతటి బలహీన ముఖ్యమంత్రిని తాను చూడ లేదన్నారు. ఒక మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులను ముఖ్యమంత్రి పంపడం, నిందితుని స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని మాయమైపోవడం ఎప్పుడూ చూడలేదేని పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి అనుచరుడు, ఆప్తుడు రోహిన్ రెడ్డి ఎలా బెదిరింపులకు పాల్పడుతున్నాడో మంత్రి కూతురు సుష్మితా పటేల్ బహిరంగంగానే చెప్పిందన్నారు. అయినా సోయి లేకుండా పోయిందన్నారు కేటీఆర్.
KTR Slams CM Revanth Reddy, Jupalli Krishna Rao
స్వయంగా మంత్రి కుమార్తె సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు . సిగ్గు లేకుండా తమపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డికి సిగ్గు ఉంటే కనీసం ఈ అంశంపైన స్పందించాలని అన్నారు. స్వయంగా తన కేబినెట్ లో మంత్రులు ఆరోపణలు చేస్తుంటే ఎలా పాలన సాగిస్తాడని, ఒకవేళ అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు ఎలా తీసుకుంటాడని ప్రశ్నించారు కేటీఆర్. ఏ హోదాలో సీఎం తమ్ముళ్లకు గన్ మెన్లు ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. స్వయంగా నీ మంత్రులు మీపై ఆరోపణలు చేస్తున్నా కనీసం వారిని ముట్టుకోలేని బలహీన స్థితిలో ఉండడం దారుణమన్నారు.
Also Read : Home Minister Anitha Clear Instructions : జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి : అనిత


















