KTR Shocking Comments : సింగూరు డ్యామ్ కు పొంచి ఉన్న ముప్పు

ఆందోళ‌న వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - KTR Shocking Comments

Hello Telugu - KTR Shocking Comments

KTR : హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా సింగూరు డ్యామ్‌కు ప్ర‌మాదం చోటు చేసుకుంది. దీనిపై తీవ్రంగా స్పందించారు. మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు, నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు, నేడు సింగూరు డ్యామ్‌కు మోగిన డేంజర్ బెల్స్ చోటు చేసుకోవ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇతర ప్రాజెక్టులకు రిపేర్లు వస్తే తప్పులేదనట్టు ఫోజులు కొట్టే కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కాళేశ్వరంపై మాత్రం బురదజల్లడం.. వాళ్ల దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ప్రాజెక్టులు కట్టాక రిపేర్లు వస్తుంటాయనే విషయాన్ని మభ్యపెట్టి కేవలం మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్లను బూచిగా చూపించి కమీషన్ల‌ పేరిట కక్షగట్టడం అత్యంత దుర్మార్గం అన్నారు కేటీఆర్.

KTR Key Comments on Singaru Dyam

జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగి పోవడంతోపాటు బలహీనంగా ఉన్న ఇతర గేట్ల రోప్‌లను అలాగే గాలికొదిలేస్తే ప్రాజెక్టు నిలుస్తుందా అని ప్ర‌శ్నించారు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని. హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం చేసిన హెచ్చరికపై సోయిలేక పోతే ఎలా అని నిల‌దీశారు. దీంతో మంజీరాకు మనుగడ ఉంటుందా అని అన్నారు కేటీఆర్ (KTR). ఇవాళ సింగూరు డ్యామ్‌కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అదే ఎన్డీఎస్ఏ హెచ్చరికను కూడా అలాగే పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

జూరాలకు, మంజీరాకు, సింగూరుకు ఒక న్యాయం, మేడిగడ్డ బ్యారేజీకి మాత్రం మరో న్యాయం అంటే నాలుగు కోట్ల ప్రజలు ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. అన్ని ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. ప్రజలు సాగు, తాగునీటి గోస తీర్చే ఏ ప్రాజెక్టునైనా కంటికి రెప్పలా కాపాడాల్సిందేన‌ని పేర్కొన్నారు.

Also Read : Telangana Govt Shocking : కొత్త వాహనాలు కొనేవారికి తెలంగాణ సర్కార్ భారీ షాక్

Exit mobile version