KTR : హైదరాబాద్ – హైదరాబాద్ లో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. మృతుల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు కేటీఆర్ (KTR). తమ పార్టీ తరపున కూడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. కుటుంబం కోసం కాయకష్టం చేసే కష్టజీవులు కల్తీ కల్లు బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
KTR Comments
కల్తీ కల్లు కారణంగా ఇంత మంది చనిపోతే ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం చాలా దారుణమని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. కల్తీ కల్లు అమ్మకుండా కట్టుదిట్టంగా ఫోకస్ పెట్టాలని సూచించారు. ఎవరి ప్రాణమైనా ఒక్కటేనని పేర్కొన్నారు. బాధ్యత కలిగిన సీఎం కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీలు ఇవ్వడంపైన ఉన్నంత శ్రద్ద ఈ కాంగ్రెస్ సర్కార్ కు ఆదుకోవాలన్న సోయి లేదన్నారు కేటీఆర్ .
పేదలకు రూ.4000 పెన్షన్ , ఆడబిడ్డలకు రూ.2500 మహాలక్ష్మి పథకం, అన్నదాతలకు రుణ మాఫీ కాదన్నారు. ఇలా ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు అమలు చేసిన పాపాన పోలేదన్నారు మాజీ మంత్రి.
Also Read : Tennis Player Death : టెన్నిస్ ప్లేయర్ ను చంపేసిన తండ్రి
