KTR Fired on CM Revanth Reddy : కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - KTR Fired on CM Revanth Reddy

Hello Telugu - KTR Fired on CM Revanth Reddy

KTR : హైద‌రాబాద్ : రేవంత్ రెడ్డి స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ జైత్రయాత్రతో ప్రజలు సురుకు పెట్టాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ , బీజేపీ ల జాయింట్ వెంచ‌ర్ రేవంత్ స‌ర్కార్ అంటూ సెటైర్ వేశారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలు కావు అని వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ నిత్యం విమర్శించే మోడీ, అదానీలను రేవంత్ వెనుకేసుకు వ‌స్తున్నాడ‌ని, దీని వెనుక ఉన్న మ‌ర్మం ఏమిటో చెప్పాల‌న్నారు. వక్ఫ్ సవరణలను దేశంలోనే తొలిసారిగా రేవంత్ ప్రభుత్వం అమలు చేసిందని ఆరోపించారు.

KTR Slams CM Revanth Reddy

చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని మండిప‌డ్డారు కేటీఆర్. రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక డిసైడ్ చేస్తుందని చెప్పారు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగుర వేసి చుక్క‌లు చూపించాల‌న్నారు కేటీఆర్. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం తమకు లేదని ఆ పార్టీ నాయకులు భావిస్తారని అన్నారు. కారు కావాలో కాంగ్రెస్, బీజేపీ బేకార్ గాల్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలని కోరారు. తెలంగాణ రక్షగా, గొంతుగా ఉన్న కేసీఆర్‌ను లేకుండా చేయాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడి లక్ష్యం అని ఆరోపించారు కేటీఆర్.

Also Read : MP Gurumurthy Effort Success : ఫ‌లించిన ఎంపీ గురుమూర్తి ప్ర‌య‌త్నం

Exit mobile version