KTR Fired on Congress : కాంగ్రెస్ హామీలు గాలిలో దీపాలు : కేటీఆర్

కాంగ్రెస్ బాకీ కార్డుల‌ను విడుద‌ల చేసిన బీఆర్ఎస్

Hello Telugu - KTR Fired on Congress

Hello Telugu - KTR Fired on Congress

KTR : హైద‌రాబాద్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, రేవంత్ మోసాన్ని ప్రజలకు వివరించేలా రూపొందించిన కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేసింది బీఆర్ఎస్. శ‌నివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హ‌రీశ్ రావు, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నా చారి, మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్, త‌దిత‌రులు. అభయహస్తం అన్నార‌ని, బాండ్ పేపర్లు పంచారని, ఇది అభయహస్తం కాదు, అచేతన హస్తం అని ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. ఆనాడు గాంధీ టోపీలు పెట్టి ఇంటింటికి గ్యారెంటీ కార్డులు పంచారని ఎద్దేవా చేశారు. గ్యారెంటీ కార్డు గాసిప్ కార్డుగా మారింద‌ని ఆరోపించారు. వంద రోజుల్లోనే అమలు చేస్తాం, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తాం అన్నారని వాటి ఊసే ఎత్త‌డం లేద‌న్నారు.

KTR Slams Congress

రేవంత్ మాటలు ప్రజలు నమ్మరని గాంధీలతో ప్రచారం చేయించారని, ఆ గాంధీలు ఈరోజు హైదరాబాద్‌కు రాని పరిస్థితి నెల‌కొంద‌న్నారు. ఎక్కడ నిలదీస్తారో అని వారికి భయం ప‌ట్టుకుంద‌న్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు ముఖం చాటేస్తున్నారో ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌న్నారు . మీ ముఖ్యమంత్రి అమలు చేయడం లేదు, ఎందుకు ప్రశ్నించడం లేదని ప్ర‌శ్నించారు. అవ్వకు కోడలుకు ఇద్దరికి పింఛన్ ఇస్తామ‌న్నార‌ని , రైతుకు, కౌలు రైతుల‌కు భ‌రోసా ఏమైంద‌న్నారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదని కటింగ్ మాస్టర్ అయ్యాడ‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ ప్రారంభించిన వాటికి రిబ్బన్ కటింగ్ చేస్తూ కేసీఆర్ అమలు చేసిన పథకాలకు కటింగ్ పెట్టాడ‌ని ఆరోపించారు.

Also Read : CM Chandrababu Strong Focus : ఉత్ప‌త్తుల త‌యారీపై దృష్టి సారించాలి : సీఎం

Exit mobile version