KTR : హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయమై పోయిందని, ఇక కావాల్సిందల్లా మెజారిటీ ఎంత వస్తుందనే దానిపైనే తాము నిరీక్షిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). నియోజకవర్గంలోని బోరబండలో ఆయన రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ సర్కార్ పై సెటైర్స్ వేశారు. హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయక పోవడం, ఇతరులపై నిందలు వేయడం సీఎంకు, మంత్రులకు, నేతలకు ఒక అలవాటుగా మారిందంటూ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎలా అభివృద్ది చెందిందో, ఈ రెండేళ్ల రేవంత్ సర్కార్ సాధించింది ఏమిటో బేరీజు వేసుకోవాలని కోరారు.
KTR Challenge
మోసం కాంగ్రెస్ పార్టీ నైజం అని, ఆనాడు చేసిన పోరాటాలు, ఆందోళనల వల్లనే తెలంగాణ వచ్చిందన్న విషయం మరిచి పోకూడదన్నారు కేటీఆర్. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల కొలువులు ఏడున్నాయని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు తులం బంగారం, యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలు అడ్రస్ లేకుండా పోయారంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరని, కర్ర కాల్చి వాత పెట్టేందుకు రెడీ అయ్యారంటూ జోష్యం చెప్పారు కేటీఆర్. ఇకనైనా ప్రజలు మేలుకోవాలని, సర్కార్ మోసాన్ని గుర్తించాలని లేక పోతే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు.
Also Read : Hydraa Growth : హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ


















