KS Vishwanathan : విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ కొత్త సంచాలకుడిగా కె.ఎస్. విశ్వనాథన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 8.45 గంటలకు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లోని శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆయన కొలువు తీరారు. కాగా ఇదే పదవిలో ఇంతకు ముందు ఉన్న హిమాన్షు శుక్లాను ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో తాత్కాలికంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రఖర్ జైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
KS Vishwanathan Promoted
ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) కమిషనర్‌గా పనిచేస్తున్న కె.ఎస్. విశ్వనాథన్ (KS Vishwanathan) ను బదిలీ చేసింది. రాష్ట్రంలో కీలకమైన సమాచార, పౌర సంబంధాల శాఖకు కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా కీలకమైన పదవులు నిర్వహించారు విశ్వనాథన్. తన పనితీరుతో ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా ఇటీవల సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఐఏఎస్ లు, ఐపీఎస్ లతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంతటా పని చేస్తున్న వీరి పనితీరుపై ఆరా తీశారు. ఆయా పదవులలో ఉన్న వీరి పనితీరు ఆధారంగా పోస్టులను కేటాయించారు.
ఇందులో భాగంగా విశ్వనాథన్ గతంలో అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్‌గా, నరసాపురం సబ్ కలెక్టర్‌గా, అలాగే ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా కీలక పదవుల్లో సేవలందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాఖ కార్యకలాపాలు, విధుల నిర్వాహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Also Read : Supreme Court Important Update on Karur : కరూర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం
