Konda Murali : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తన తోటి మంత్రి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ మాదిగను ఉద్దేశించి దున్నపోతు అని కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఈ విషయాన్ని బహిరంగంగానే అభ్యంతరం తెలిపారు లక్ష్మణ్. బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని పట్టు పట్టారు. పరిస్థితి డ్యామేజ్ చేస్తుందని గమనించిన పొన్నం ప్రభాకర్ ఉన్నట్టుండి తను అన్న మాటలు నొచ్చుకుంటే క్షమించాలని పేర్కొన్నారు. తాజాగా మరో ఇద్దరి మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చింది.
Konda Murali Slams Minister Ponguleti Srinivas Reddy
ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవహారాల్లో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి (Konda Murali). జిల్లా రాజకీయాల్లో మంత్రి ఆధిపత్యం వహించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. శనివారం మీడియా ముందు సీరియస్ అయ్యారు పొంగులేటిపై. మేడారం ఆలయ టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత ఆరోపించారు . జిల్లాలో పొంగులేటి ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు తను ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రధానంగా ఎండోమెంట్స్ శాఖ వ్యవహారాల్లో, ముఖ్యంగా మేడారం ఆలయ టెండర్ ప్రక్రియలో పొంగులేటి జోక్యం చేసుకోవడం పట్ల మండిపడ్డారు.
పొంగులేటి సొంత కంపెనీకి కొన్ని పనులు అప్పగించారని సంచలన ఆరోపణలు చేశారు కొండా మురళి.
ఈ విషయాన్ని మురళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకెళ్లారని జోరుగా ప్రచారం జరిగింది. తన ఫిర్యాదుకు పార్టీ హైకమాండ్ సానుకూలంగా స్పందించిందని ఆయన పేర్కొనడం విశేషం.
Also Read : PM Modi AP Important Visit : ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
