మంత్రి ప‌ద‌విపై రాజ‌గోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ప‌రిస్థితులు అనుకూలించ‌క పోవ‌డం వ‌ల్లే రాలేదు

hellotelugu-KomatireddyRaajaGoplaReddy

న‌ల్ల‌గొండ జిల్లా : మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మ‌రోసారి మంత్రి ప‌ద‌విపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏదో ఒక రోజు త‌న‌కు కేబినెట్ బెర్త్ ఖాయ‌మ‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఒకే కుటుంబంలో ఒక్క‌రికే ప‌ద‌వి ఉండాల‌న్న రూల్ ఏమీ లేద‌న్నారు. తాను ప‌ద‌వుల కోసం ఏనాడు పాకులాడిన దాఖ‌లాలు లేవ‌న్నారు . అయితే మంత్రి ప‌ద‌వి ఎందుకు రాలేద‌న్న ప్ర‌శ్న‌కు కీల‌క స‌మాధానం ఇచ్చారు. ప‌రిస్థితులు అనుకూలించక పోవడం వల్లే త‌న‌కు మంత్రి పదవి రాలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.

కాంగ్రెస్ అధిష్ఠానం, అగ్ర నేత రాహుల్ గాంధీ మీద పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇచ్చిన మాటల నిలబెట్టు కుంటారనే నమ్మకం ఉందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల‌ని కోరారు. గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాదేన‌ని స్ప‌ష్టం చేశారు. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత బెల్టు షాపులు బంద్ చేయించానని చెప్పారు. మద్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంద‌న్నారు.

తాను ఏనాడూ మంత్రి ప‌ద‌వి గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించ లేద‌ని చెప్పారు. ఏదో ఒక రోజు త‌న‌కు త‌ప్ప‌కుండా కేబినెట్ లో చోటు ద‌క్కుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.

Exit mobile version