Kodandaram Reddy Shocking Comments : ప‌ద‌వుల కోసం ఏనాడూ పాకులాడ లేదు

స్ప‌ష్టం చేసిన ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ రెడ్డి

Hello Telugu - Kodandaram Reddy Shocking Comments

Hello Telugu - Kodandaram Reddy Shocking Comments

Kodandaram Reddy : హైద‌రాబాద్ – ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఎమ్మెల్సీ పై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు ఇవ్వ‌డంపై స్పందించారు. త‌న‌ ప్రయాణం పదవులతో మొదలు కాలేదన్నారు. పదవులతోనే ఆగి పోయేది కాదన్నారు. ఏదో వస్తుందని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా ప్రయాణం ప్రారంభించ లేద‌న్నారు. త‌న ల‌క్ష్య సాద‌న కోసం త‌న జ‌ర్నీ, పోరాటం కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నారు. జన జీవితంలో అనేక అవాంతరాలు, అడ్డంకులు, ఒడిదుడుకులు ఉంటాయ‌న్నారు. త‌న ఎన్నికపై ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా పట్టించుకోనని, వారి విజ్ఞతకే వదిలేస్తానని స్ప‌ష్టం చేశారు.

Kodandaram Reddy Key Comments

శుక్ర‌వారం కోదండ‌రాం రెడ్డి (Kodandaram Reddy) మీడియాతో మాట్లాడారు. తాను స‌ర్వోన్న‌త న్యాయ స్థానం ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడ‌ద‌ల్చు కోలేద‌న్నారు. ఎందుకంటే ఇది మంచి ప‌ద్దతి కాద‌న్నారు. దీనిపై కోర్టుకు మ‌రోసారి వెళ్లాల‌ని అనుకోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. త‌న జీవితం ఏమిటో, నా ప్ర‌స్థానం ఏమిటో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌న్నారు. త‌న గురించి ఇంకొక‌రు నిర్ణ‌యించే స్థాయికి తాను దిగ‌జార లేద‌న్నారు. తాను ముందు నుంచీ ప్ర‌జ‌ల కోసం, తెలంగాణ స‌మాజం కోసం ప‌ని చేస్తూ వ‌చ్చాన‌ని చెప్పారు. పౌర హ‌క్కుల కోసం, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌న వాయిస్ వినిపిస్తూ వ‌చ్చాన‌ని చెప్పారు కోదండ‌రాం రెడ్డి.

రాబోయే రోజుల్లో త‌న ప్ర‌యాణం ప్ర‌జ‌ల కోసం కొన‌సాగుతుంద‌ని మ‌రోసారి స్పష్టం చేశారు ప్రొఫెస‌ర్. ఇదిలా ఉండ‌గా కోదండ‌రాం, మీర్ అలీ ఖాన్ ల ఎమ్మెల్సీ ప‌ద‌వులు చెల్లుబాటు కావంటూ భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది.

Also Read : KTR Interesting Comments : సుప్రీం తీర్పు ప్ర‌జాస్వామ్యానికి బ‌లం

Exit mobile version