KTR Interesting Comments : సుప్రీం తీర్పు ప్ర‌జాస్వామ్యానికి బ‌లం

మాజీ మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Hello Telugu - KTR Interesting Comments

Hello Telugu - KTR Interesting Comments

KTR : హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు తాజాగా భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై. స‌ర్ (ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ) ఓటర్ల తొలగింపులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్న‌ట్లు తెలిపారు. 79వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ దేశానికి కోర్టు ఇచ్చిన తీర్పు మ‌రింత న‌మ్మ‌కాన్ని క‌ల్పించేలా చేసింద‌న్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది దేశంలో ప్రజాస్వామ్యానికి గొప్ప విజయం అని స్ప‌ష్టం చేశారు. ఎన్నికల సంఘంతో ఇటీవల జరిగిన సమావేశంలో, త‌మ‌ పార్టీ బీఆర్ఎస్, ఓటర్ల తొలగింపు డేటాను ప్రచురించాలని, పౌరసత్వానికి రుజువుగా ఆధార్‌ను అంగీకరించాలని డిమాండ్ చేసింద‌న్నారు. ఇదే విష‌యాన్ని తాము ఈసీకి విన్న‌వించ‌డం జ‌రిగింద‌న్నారు కేటీఆర్ (KTR).

KTR Key Comments

ఒక పారదర్శక, బలమైన ప్రజాస్వామ్య ప్రక్రియ భారత రాజకీయాలకు బలమైన వెన్నెముక అవుతుంద‌న్నారు . సుప్రీం కోర్టు తీర్పును తన విజయంగా చెప్పుకుంటున్న ఎంపీ రాహుల్ గాంధీకి, తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి సుప్రీం కోర్టు మరొక బలమైన ఆదేశం ఇచ్చిందని తాను గుర్తు చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ఓటుకి విలువ ఉండేలా చూసుకోవడం ఎంత ముఖ్యమో, అదే ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం అని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును తన కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని, దానిని అమలు చేస్తుందని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చే ధైర్యం ఉందా అని నిల‌దీశారు.

Also Read : CM Chandrababu – AP Growth : సుప‌రిపాల‌న‌తో ఏపీ అభివృద్దిలో ముంద‌డుగు

Exit mobile version