ఫిన్ అలెన్ దెబ్బ గుజ‌రాత్ టైటాన్స్ అబ్బా

35 బంతులు 4 ఫోర్లు 10 సిక్సులు 93 ర‌న్స్

hellotelugu-FinnAllenn

కోల్ క‌తా : ఐపీఎల్ 19 సీజ‌న్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇప్ప‌టికే టోర్నీ ఆఖ‌రు ద‌శ‌కు చేరుకుంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయ‌నేది స‌స్పెన్స్ వీడ‌డం లేదు. ఇక చావో రేవో తేల్చు కోవాల్సిన స‌మ‌యంలో జూలు విదిల్చింది. ఈ కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ ను స్వంత గ‌డ్డంపై వ‌రుస గెలుపుల‌తో ఊపు మీదున్న శుబ్ మ‌న్ గిల్ సేన‌కు బిగ్ షాక్ ఇచ్చింది. 29 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది కోల్ క‌తా . ముందుగా బ్యాటింగ్ కు దిగింది కేకేఆర్. రహానే త్వ‌ర‌గా వెనుదిరిగినా ఆ త‌ర్వాత మైదానం న‌లుమూల‌లా విరుచుకుప‌డ్డాడు ఫిన్ అలెన్. త‌ను విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు.

ఫిన్ అలెన్ 35 బంతులు ఆడి 4 ఫోర్లు 10 సిక్స‌ర్ల‌తో 93 ర‌న్స్ చేస్తే ర‌ఘువంశీ 44 బంతులు ఆడి 4 ఫోర్లు 7 సిక్స‌ర్ల‌తో 82 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కేమ‌రూన్ కూడా స‌త్తా చాటాడు. త‌ను కూడా ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. దీంతో భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది గుజ‌రాత్ టైటాన్స్ ముందు. అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ సైతం భారీ ఎత్తున పోరాడేందుకు ప్ర‌య‌త్నించింది. గిల్ , బ‌ట్ల‌ర్, సాయి సుద‌ర్శ‌న్ ఆడినా ఫ‌లితం లేకుండా పోయింది. అద్భుత‌మైన విజ‌యంతో కేకేఆర్ కూడా ప్లే ఆఫ్స్ పై ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది. ఇక ఇవాళ రెండు కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి.

Exit mobile version