Kingdom : హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు నటుడు విజయ్ దేవరకొండ. తను గత కొంత కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. గౌతమ్ తిన్నసూరి చివరకు తనకు సక్సెస్ తీసుకు వచ్చాడు కింగ్ డమ్ (Kingdom) మూవీ రూపంలో. కథ పరంగా , చిత్రీకరణ పరంగా మొత్తంగా సినిమా పరంగా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తీయడంలో తనదైన ముద్ర కనబర్చాడు. ఇక ఇందులో ముఖ్య భూమిక పోషించిన విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే సైతం మంచి మార్కులు కొట్టేశారు. దీంతో ఫుల్ ఖుష్ లో ఉన్నాడు ఈ రౌడీ బాయ్.
Hero Vijay Deverakonda Kingdom Movie Success
ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్ డమ్ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నిర్మాతలకు బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పక తప్పదు. కేవలం ఓపెనింగ్ రోజే ఏకంగా ఈ సినిమా రూ. 20 కోట్లు వసూలు చేసినట్లు టాలీవుడ్ లో బిగ్ టాక్. ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూశారు ఈ మూవీ కోసం. ప్రత్యేకించి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. తనతో పూరీ జగన్నాథ్ తీసిన లైగర్ బెడిసి కొట్టింది. ఆ తర్వాత సమంతతో కలిసి నటించిన ఖుషీ ఆశించిన మేర ఆడలేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చింది కింగ్ డమ్.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన బొమ్మదేవర నాగ వంశీ నిర్మించారు ఈ మూవీని. విడుదలయ్యేందుకు కొంత ఆలస్యమైంది. కానీ ఎట్టకేలకు జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ఇక విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అమరికాలో. ఇక్కడే భారీగా వసూళ్లు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. ప్రారంభం రోజున 64 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. గత వారం విడుదలైన పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లుతో సమానంగా ఉంది.
Also Read : Hero Pawan Kalyan – Ustaad Bhagat Singh : త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
