Hero Pawan Kalyan – Ustaad Bhagat Singh : త్వ‌ర‌లోనే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

శ‌ర‌వేగంగా సినిమా షూటింగ్ చేస్తున్న హ‌రీశ్ శంక‌ర్

Hello Telugu - Hero Pawan Kalyan - Ustaad Bhagat Singh

Hello Telugu - Hero Pawan Kalyan - Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh : టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయితే ద‌మ్మున్న డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా త‌ను అనుకున్న‌ది తీసుకుంటూ పోవ‌డమే. త‌ను ఏరికోరి తీసుకు వ‌చ్చిన హీరోయిన్ భాగ్య‌శ్రీ బోర్సేకు మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. త‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టించిన కింగ్ డ‌మ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్ తో దుమ్ము రేపుతోంది. ఇదే స‌మ‌యంలో ప‌లు సినిమాల‌లో త‌ను ఎంపికైంది. ఇప్ప‌టికే మ‌రో మూవీ రామ్ పోతినేనితో తీస్తోంది. ఇక ముద్దు సీన్ లో రెచ్చి పోయినా క‌థ ప‌రంగా ఇది త‌ప్ప‌డం లేద‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌.

Ustaad Bhagat Singh Movie Release Updates

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా విష‌యానికి వ‌స్తే లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (Ustaad Bhagat Singh) తీస్తున్నాడు హ‌రీష్ శంక‌ర్. త‌ను గ‌తంలో స‌ల్మాన్ ఖాన్ హిందీలో న‌టించిన ద‌బాంగ్ కు మాతృక‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గబ్బ‌ర్ సింగ్ తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప‌వ‌ర్ స్టార్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఇప్పుడు క‌సి మీద ఉన్నాడు హ‌రష్ శంక‌ర్ . ఇందులో కీ రోల్స్ పోషిస్తున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తోడుగా అందాల ముద్దుగుమ్మ శ్రీ‌లీల ఒక‌రు కాగా మ‌రొక‌రు రాశీ ఖ‌న్నా. హ‌రీష్ శంక‌ర్ త‌ను తీసిన సినిమాలో గ‌తంలో న‌టించింది.

ఇక ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది. క్లైమాక్స్ సీన్ అద్భుతంగా ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించాల‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్న‌ట్లు టాలీవుడ్ లో టాక్. ఏది ఏమైనా డీఎస్పీ మ్యూజిక్, ద‌ర్శ‌కుడి మ్యాజిక్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టార్ ఇమేజ్, శ్రీ‌లీల డ్యాన్సుల‌తో సినిమా ఓ రేంజ్ లో ఆడేది ఖాయ‌మ‌ని అంటున్నారు సినీ వ‌ర్గాలు.

Also Read : Hero Vijay Sethupathi – Dr Ramya Mohan : విజ‌య్ సేతుప‌తి విమ‌నైజ‌ర్ – డాక్ట‌ర్ ర‌మ్య

Exit mobile version