Khairatabad RTO Growth : వేలం పాట‌లో ఖైర‌తాబాద్ ఆర్టీఓ రికార్డ్

ఒకే రోజు రూ. 63 లక్ష‌లు భారీ ఆదాయం

Hello Telugu - Khairatabad RTO Growth

Hello Telugu - Khairatabad RTO Growth

Khairatabad : హైద‌రాబాద్ : ఫ్యాన్సీ నెంబ‌ర్ క్రేజ్ కాసుల వ‌ర్షం కురిపించేలా చేస్తోంది. తాజాగా హైద‌రాబాద్ లోని ఖైర‌తాబాద్ ప్రాంతీయ ర‌వాణా కేంద్రంలో నిర్వ‌హించిన వేలం పాట‌లో ఏకంగా రూ. 63 ల‌క్ష‌లు సంపాదించింది. ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల వేలం నిర్వ‌హించింది. కేవంలో ఒకే రోజులో ఇంత పెద్ద మొత్తంలో స‌మ‌కూర‌డం విస్తు పోయేలా చేసింది. ఇది ఒక ర‌కంగా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఈనెల 12న దీనిని చేప‌ట్టింది ప్రాంతీయ కార్యాల‌యం. ఆక్ష‌న్ లో పేరు పొందిన కంపెనీల‌తో పాటు వాహ‌న‌దారులు పాల్గొన్నారు. న‌గ‌రంలో ఫ్యాన్సీ నెంబ‌ర్స్ పై పెరుగుతున్న క్రేజ్ ను ప్ర‌తిబింబించేలా చేసింది.

Khairatabad RTO Updates

ఖైర‌తాబాద్ (Khairatabad) ఆర్టీఏ వేలం పాట‌లో మొత్తంగా రూ. 63,77,361 ల‌క్ష‌లు ల‌భించాయి. ఇదిలా ఉండ‌గా ఔషధ దిగ్గజం హెటెరో డ్రగ్స్ రూ. 25,50,200 రికార్డు బిడ్‌తో ప్రతిష్టాత్మకమైన నంబర్ TG 09 J 9999ను కైవ‌సం చేసుకుంది. ఇది ఈ సెషన్‌లో అత్యధికం అని ఆర్టీఓ అధికారులు వెల్ల‌డించారు.ఇతర టాప్ బిడ్డర్లలో ఏఆర్ఎల్ టైర్స్ రూ. 6,25,999 కు టీజీ 09 0009 ను గెలుచుకుంది, ఏఎంఆర్ ఇండియా రూ. 5,11,666 కు టీజీ 09 J 0006 ను కొనుగోలు చేసింది. అనేక మంది వ్యక్తులు కూడా పోటీలో పాల్గొన్నారు. వెంకటేశ్వర్ రావు శృంగవర‌పు టీజీ 09జె 0005 కోసం రూ. 2.22 లక్షలు చెల్లించగా, పోచా విజయ టీజీ 09 J 0007 ను రూ. 1,51,999 కు కొనుగోలు చేశారు.

అదేవిధంగా, తాహెర్ సినీ టెక్నిక్ రూ. 1,30,999 కు టీజీ 09 J 0099 ను పొందింది. అయితే మీర్ అశ్వాక్ జహీర్ టీజీ 09 9990 కోసం రూ. 1.22 లక్షలు చెల్లించారు. ఇతర విజయవంతమైన బిడ్డర్లలో ఉజ్వల మనోహర్ మాడ టీజీ 09 J 0027 రూ. 1,04,999 చేజిక్కించు కోగా ముప్పల రాజశేఖర్ రాజు టీజీ 09 0234 నెంబ‌ర్ ను రూ. 1,01,234) ధ‌ర‌కు ద‌క్కించుకున్నారు.

Also Read : Minister Anam Clear Instructions : విష జ్వ‌రాల‌పై మంత్రి ఆనం ఆరా

Exit mobile version