Keshava Rao : హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ కె. కేశవరావు (Keshava Rao) బీసీల రిజర్వేషన్ల అంశంపై స్పందించారు. రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేయొద్దని ఆయా పార్టీలకు సూచించారు. ప్రధానంగా బీఆర్ఎస్ పదే పదే కామెంట్స్ చేయడాన్ని తప్పు పట్టారు. జీవో ఇస్తే మళ్లీ కోర్టుకు వెళతారని అన్నారు. గులాబీ నేతలు పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో కె. కేశవరావు మీడియాతో మాట్లాడారు.
Ex MP Keshava Rao Key Comments on BRS
ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయం చేయాలన్న సత్ సంకల్పంతో తమ పార్టీ ఈ అసాధారణమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చిందన్నారు. తీర్మానం కూడా చేయడం జరిగిందన్నారు. కానీ పదే పదే గులాబీ నేతలు పూర్తిగా ఎలాంటి సమాచారం లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. దీని వల్ల బీసీలలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందన్నారు కేశవరావు.
బీసీల రిజర్వేషన్లకు సంబంధించి పూర్తిగా చట్ట బద్దత తీసుకు రావాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. వీటిని అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కి వెళుతుందని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారని అన్నారు. లక్షలాది మంది బీసీలు ఈ నిర్ణయం వల్ల లబ్ది పొందే అవకాశం ఉంటుందన్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ పై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Telangana Govt Proven : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్
